Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : భారతదేశంలోని అతి పెద్ద లెర్నింగ్ ప్లాట్ఫారం అన్అకాడమి తన ప్లాట్ఫారంలో కొత్త ఉత్పత్తి అన్అకాడమి కాంపీట్ను పరిచయం చేసింది.
అన్అకాడమి కాంపీట్ ఆన్లైన్ విద్యలో వినూత్న తరహా అనుభవం కాగా, విద్యార్థులకు ఇతర లెర్నర్లతో నేరుగా ముఖాముఖి అయ్యే మరియు వారి సన్నాహాలను రియల్-టైమ్‌లో మూల్యాంకనం చేసుకునేందుకు అవకాశం ఇస్తుంది. కాంపీట్తో అన్అకాడమి ప్రతి లెర్నర్కూ తనదే అయిన ప్రత్యేక రేటింగ్ ఇచ్చే ఏకైక ప్లాట్పారంగా నిలిచింది.
సరికొత్త కాంపీట్ అనుభవం
ఇన్స్టెంట్ మ్యాచింగ్: కాంపీట్ తక్షణమే మిమ్మల్ని మరొక లెర్నర్తో భారతదేశంలో ఎక్కడి నుంచి అయినా మీ సిద్ధత మరియు సిలబస్‌ను పూర్తి చేయడం ఆధారంగా మ్యాచ్ చేస్తుంది.
క్యూరేటెడ్ ప్రశ్నలు: సిలబస్ నుంచి అభ్యర్థులు ఇప్పటికే పూర్తి చేసిన ఉన్నత నాణ్యత ప్రశ్నలను రూపొందిస్తుంది. సన్నాహాలు కొనసాగున్నట్లే వారికి వారి సిద్ధతల్లో నిఖర మూల్యాంకనానికి మద్దతు ఇచ్చేలా కొత్త ప్రశ్నలను చేర్చుతుంది. డ్రాపర్ లెర్నర్లు వారి పూర్తి సిలబస్ నుంచి ప్రశ్నలపై పోటీ పడవచ్చు.
తీవ్రమైన 1 వర్సెస్ 1 పోటాపోటీ: ఇద్దరు లెర్నర్లు మొత్తం 5 ప్రశ్నలకు బదులివ్వవచ్చు. అందులో వారికి 60 క్షణాలను ప్రతి ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఎక్కువ కచ్చితత్వంతో వేగంగా సమాధానం ఇచ్చే లెర్నర్లు కాంపీట్ పోటీ గెలుస్తారు మరియు వారి రేటింగ్ తక్షణమే మెరుగుపరుచుకుంటారు.
ప్రత్యేక రేటింగ్: వారి రేటింగ్ ఆధారంగా లెర్నర్లు బిగినర్, హస్లర్, ప్రో, స్కాలర్ లేదా ఛాంపియన్ అనే దశలకు చేరుకుంటారు. వారి రేటింగ్ మెరుగుపడుతున్న కొద్దీ వారి స్థాయిలను వృద్ధి చేసుకోవచ్చు.
లెర్నర్లు పోటీ పడాలని కోరుకుంటారు.
అక్టోబరులో ఇది లైవ్ అయిన తర్వాత 65,000+ లెర్నర్లు ఇప్పటికే యాప్‌లో పోటీ పడి మొత్తం 1 MN మ్యాచ్‌లు ఆడారు. లెర్నర్లు 40,000 గంటలను కాంపీట్లో ఆడుతూ కాలం వెళ్లదీశారు మరియు 1800 లెర్నర్లు 100 సార్లు లేదా అంతకన్నా ఎక్కువసార్లు పోటీ పడ్డారు. 6 లెర్నర్ 1000 పోటీల మైలురాయిని చేరుకున్నాడు.
ఈ సరికొత్త ప్రొడక్ట్ గురించి అన్కాడమి సహ- వ్యవస్థాపకుడు మరియు సీఈఓ హేమేశ్ సింగ్ మాట్లాడుతూ, ‘‘అన్అకాడమిలో మేము వరుసగా లెర్నర్లకు ఎక్కువ వినోదం మరియు క్రియాశీలకం చేసే వ్యాపారంలో అగ్రగామి మరియు ఆవిష్కారాత్మక ఉత్పత్తి అనుభవాలను సృష్టించేందుకు శ్రమిస్తున్నాము. మేము అందరికీ కాంపీట్ను ఉచితంగా అందుబాటులో ఉచడంతో, పరీక్షల్లో విజయం సాధించాలని కోరుకునే ప్రతి లెర్నర్కూ ఇతర లెర్నర్తో పోటీ పడి తాను ఎంత మేర నేర్చుకున్నారో తెలుసుకునేందుకు అవకాశం ఉంటుంది. రానున్న నెలల్లో మేము కాంపీట్లో సదృఢమైన మరియు దుర్బలమైన విషయాలు, మెరుగుపరుచుకోవలసిన విషయాలు తదితర పర్సనలైజ్ చేసిన ఇన్పుట్లను చూపించడం ద్వారా మద్దతు ఇవ్వాలని యోచిస్తున్నాము. ఇది లెర్నర్లకు వారు చేసుకునే సన్నాహాల్లో కచ్చితంగా సహకరిస్తుంది’’ అని పేర్కొన్నారు.