Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : అత్యంత కీలకమైన 100కు పైగా మేధోసంపత్తి హక్కుల కోసం దరఖాస్తు చేయడం ద్వారా ప్యూర్ ఈవీ అత్యంత కీలకమైన మైలురాయిని చేరుకుంది. ఈ కంపెనీ ఇప్పుడు బోర్న్ ఈవీ స్టార్టప్స్ విభాగంలో అగ్రగామి సంస్ధగా నిలిచింది. పరిశోధనా లక్ష్యిత తమ సంస్కృతి గురించి ప్యూర్ ఈవీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ రోహిత్ వదేరా మాట్లాడుతూ PURE EV R &D ప్రోగ్రామ్ ‘‘పవర్ట్రైన్ డిజైన్‌లో అత్యంత కీలకమైన సాంకేతిక అభివృద్ధి పై దృష్టి సారించింది అని తెలిపారు. తుది వినియోగదారులకు ఆహ్లాదకరమైన అనుభవాలను అందించేందుకు ఇది మాకు తోడ్పడుతుంది. మేము అత్యంత బలమైన ఆర్ అండ్ డీ బృందంను అభివృద్ధి చేశాము. వీరిలో 100 మందికి పైగా ఇంజినీర్లు, థర్మల్ మేనేజ్మెంట్, ఎంబీడెడ్ సిస్టమ్స్, పవర్ ఎలకా్ట్రనిక్స్, రవాణా, ప్రొడక్ట్ డిజైన్, ఎలక్ట్రో –కెమిస్ట్రీ వంటి అంశాలలో అర్హత కలిగిన వారు. తొలి దశ స్వీకరణ దశ నుంచి అత్యంత వేగంగా ఈవీ పరిశ్రమ ఇప్పుడు వృద్ధి చెందుతుంది. విస్తృత స్ధాయిలో వాస్తవ ప్రపంచపు ట్రయల్స్ మరియు పరీక్షా ప్రక్రియలు ఇప్పుడు పనితీరు ధృవీకరణ కోసం అత్యవసరం. మేము విస్తృతస్ధాయిలో ఆర్ అండ్ డీ సదుపాయాలు ఏర్పాటుచేయడంతో పాటుగా మా పరిశోధనా కేంద్రం వద్ద ఈ కారణం కోసం పరీక్షా సదుపాయాలను సైతం ఏర్పరిచాము. అంతేకాదు రాబోయే 18 నెలల్లో మరో 200 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టనున్నాము’’ అని అన్నారు. మేధోసంపత్తి హక్కులపై ప్యూర్ ఈవీ యొక్క లక్ష్యం మరియు ఈ మైలురాయి అధిగమించడంలో అత్యంత కీలకమైన ఆవశ్యకత పట్ల శ్రీ రోహిత్ వదేరా మాట్లాడుతూ ‘‘ నూతన తరపు ఈవీ పరిశ్రమలో, సరఫరా చైన్ అభివృద్థి అనేది కాలం గడిచే కొద్దీ జరుగుతుంటుంది. అందువల్ల, పెద్దమొత్తాలను అంటే టర్నోవర్‌లో అధికభాగం ఆర్ అండ్ డీ వ్యయాల కోసం కేటాయించడం జరిగింది. దీని కారణంగా కంపెనీ అసాధారణ ఉత్పత్తులను నిర్మించడమూ సాధ్యపడుతుంది. స్కూటర్‌తో పాటుగా మోటర్‌సైకిల్ విభాగంలో స్థిరంగా ఐపీఆర్‌లను దరఖాస్తు చేయడం అనేది స్థిరంగా ఆవిష్కరణలను జరపాలనే కంపెనీ యొక్క కీలకమైన సిద్ధాంతం గురించి వినియోగదారులతో పాటుగా ఇతర భాగస్వాములకు తెలపడంలో అత్యంత బలమైన సూచికగా నిలుస్తుంది’’ అని అన్నారు. విభిన్నశ్రేణి ఐపీఆర్ ఫైలింగ్స్‌కు సంబంధించి అత్యుత్తమ ఉదాహరణలను గురించి ఆయన వెల్లడిస్తూ ‘‘ప్యూర్ ఈవీ యొక్క ఐపీఆర్ ఫైలింగ్స్ పూర్తి విభిన్నమైనవి, మరీ ముఖ్యంగా బ్యాటరీ థర్మల్ మేనేజ్మెంట్ వ్యవస్ధలు, రవాణా డిజైన్, పవర్ట్రైన్ కాంపోనెంట్ డిజైన్, ఎస్ఓసీ మానిటరింగ్‌పై అత్యాధునిక అల్గారిథమ్ , రేంజ్ ప్రిడిక్షన్, ఏఐ ఆధారిత బ్యాలెన్సింగ్ టెక్నిక్స్ మొదలైనవి ఉంటాయి. కస్టమైజ్డ్ ఫేజ్ ఛేంజ్ మెటీరియల్స్ (పీసీఎం) వినియోగ పరిశ్రమలో మేము అగ్రగాములం. దీనిని బ్యాటరీ ప్యాక్ యొక్క అత్యాధునిక థర్మల్ మేనేజ్మెంట్ సామర్ధ్యం కోసం వినియోగిస్తుంటాము. వీటిని వేగవంతమైన డిశ్చార్జ్ కోసం అత్యాధునిక వెంట్ మెకానిజం కోసం డిజైన్ చేశాము. మేము స్మార్ట్బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ (బీఎంఎస్)ను అభివృద్ధి చేసి అమలు చేయడంతో పాటుగా స్మార్ట్ కంట్రోలర్‌ను క్లౌడ్ కనెక్టివిటీతో వాహనాల ఆరోగ్యవంతమైన పర్యవేక్షణ, లిథయం బ్యాటరీ ప్యాక్ పర్యవేక్షణ కోసం తీర్చిదిద్దాము’’ అని అన్నారు. ఈ కంపెనీ యొక్క ఆర్ అండ్ డీ సెంటర్, ఫ్యాక్టరీ ప్రాంగణంలో కో–లొకేట్ చేయబడింది మరియు ఐఐటీ హైదరాబాద్‌తో ఫెసిలిటీస్ ఒప్పందం ఉంది. దీనిద్వారా అత్యాధునిక ఆర్ అండ్ డీ యంత్రసామాగ్రి మరియు మ్యాన్‌పవర్‌ను వినియోగించుకునే అవకాశాలున్నాయి. ఇది ఆర్ అండ్ డీ , క్వాలిటీ కంట్రోల్/ ట్రబుల్ షూటింగ్ టీమ్ నడుమ శక్తివంతమైన సంస్కృతి ఇంటరాక్షన్‌కు తోడ్పడుతుంది. కంపెనీ అభివృద్ధి ప్రాజెక్ట్‌లను అత్యంత వేగంగా అమలులోకి తీసుకువచ్చేందుకు ఇది తోడ్పడుతుంది. అదే సమయంలో ఆర్ అండ్ డీ మొత్తం దృష్టి యుటిలిటీ, రిలయబిలిటీ వృద్ధి చేయడం, తుది వినియోగదారుని కోసం ఉత్పత్తిని సురక్షితంగా ఉంచడం సాధ్యమవుతుంది. ఈ కంపెనీ ఉత్పత్తి పొర్ట్‌ఫోలియోలో రెండు స్కూటర్లు EPluto 7G మరియు ETrance NEO మరియు హై పెర్ఫార్మెన్స్ మోటర్‌సైకిల్ eTryst 350 ఉన్నాయి. మరో మోటర్‌సైకిల్‌ను త్వరలోనే విడుదల చేయనున్నారు.ఈ కంపెనీ ఒక లక్ష చదరపు అడుగుల ఫ్యాక్టరీని తెలంగాణాలో ప్రారంభించింది. దీనిలో వాహన మరియు బ్యాటరీ తయారీ విభాగాలు ఉన్నాయి. ఈ కంపెనీ దీనిని రెండు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంకు విస్తరించడానికి ప్రణాళిక చేశారు. తద్వారా వార్షిక వాహన ఉత్పత్తి సామర్ధ్యం 1,20,000 యూనిట్లకు చేరనుంది. అలాగే వార్షిక బ్యాటరీ ఉత్పత్తి సామర్ధ్యం 0.5 గిగావాట్ హవర్‌కు చేరనుంది. ఇది 2023 ఆర్ధిక సంవత్సరాంతానికి సిద్ధం కాగలదు. ప్యూర్ ఈవీ ఇప్పటికే దేశవ్యాప్తంగా తమ యొక్క డీలర్షిప్ నెట్వర్క్ ద్వారా 60 వేలకు పైగా ఈవీ ద్విచక్ర వాహనాలను డెలివరీ చేసింది. ఎగుమతుల మార్కెట్లో కూడా సంస్ధ ఈ డీలర్లు ఉన్నారు. సంస్ధ మరింతగా తమ డీలర్షిప్ నెట్వర్క్ విస్తరించడానికి ప్రణాళిక చేసింది. ఈ బ్రాండ్ ఇన్నటికే ఇతర ఆసియా దేశాలైనటువంటి నేపాల్ , భూటాన్ లాంటి చోట్ల ఎగుమతుల పరంగా ఆధిపత్య ధోరణిలో ఉంది. సౌత్ ఈస్ట్ ఆసియా, మిడిల్ ఈస్ట్, లాటిన్ అమెరికా, ఆఫ్రికా దేశాలలో ఎగుమతి అవకాశాల కోసం అన్వేషిస్తుంది.