Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ వేలాది ఉద్యోగులకు ఉద్వాసన పలికిందని సమాచారం. ఈ దఫా దాదాపుగా 1000 మందిని తీసివేసినట్టు రిపోర్టులు వచ్చాయి. తమను తొలగించారని అనేక మంది సిబ్బంది సామాజిక వేదికల్లో ఆవేదన వ్యక్తం చేశారు. తాను కూడా మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగం కోల్పోయానని సీనియర్ ఉద్యోగిని, ప్రొడక్ట్ సూపర్వైజర్ కెసి లెమ్సన్ ట్వీట్ చేశారు. ఈ ఏడాది జులైలో ఉద్యోగుల తొలగింపు ప్రణాళికలను ప్రకటించిన విషయం తెలిసిందే. అన్ని విభాగాల నుంచి ఉద్వాసన పలికినట్లు సమాచారం. మరో టెక్ దిగ్గజం మెటా కూడా 12వేల మందికి ఉద్వాసన పలికే యోచనలో ఉన్నట్లు ఇటీవలే రిపోర్టులు వచ్చాయి.