Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: శ్రీలంక పరిస్థితి మెరుగుపడుతున్న క్రమంలోనే మాస్టర్ కార్డు నేడు భారతీయ పర్యాటకులకు ఈ ద్వీప దేశం అందించే స్మరణీయ అనుభవాలను ఆవిష్కరించే ‘శ్రీలంక విత్ లవ్’ అనే క్యాంపెయిన్‌ను నేడు ప్రారంభించింది. ఈ క్యాంపెయిన్‌లో భాగంగా మాస్టర్ కార్డ్ 50కు పైగా హోటళ్లు, రిసార్టులు, రెస్టారెంట్లు మరియు టూర్ ఆపరేటర్లతో భాగస్వామ్యాన్ని కలిగి ఉండగా, భారతీయ పర్యాటకులకు శ్రీలంక ప్రాధాన్యతల గమ్యస్థానంగా ఉత్తేజించనుంది. శ్రీలంకకు భేటీ కావాలని కోరుకునే మాస్టర్‌కార్డు కలిగిన వారు మాస్టర్‌కార్డు Priceless Specials websiteలో అన్ని ప్రయోజనాలు, సదుపాయాలను వీక్షించి తెలుసుకోవచ్చు.
పలు దేశాల్లో పర్యాటకాన్ని పరిశీలించి, వారి సలహాలను పరిగణనలోకి తీసుకుని, శ్రీలంక పర్యాటకానికి యోగ్యత కలిగిన కేంద్రంగా పర్యాటకుల విశ్వాసాన్ని గమనార్హంగా పెంచింది. భారతదేశంలో పండుగ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో సామాజిక ఆర్థిక స్థిరత మెరుగుపరుచుకుంది మరియు అనుకూలకరమైన కరన్సీ ఎక్ఛేంజ్ ధర ఉండగా, అందమైన ప్రాంతాలు, సముద్ర తీరాలు, వన్యప్రాణులు, సాహస క్రీడలు, రుచికరమైన వటకాలు మరియు ప్రపంచంలో అత్యంత ప్రాచీన నగరాల్లో పుణ్యక్షేత్రాల దర్శనాన్ని పొందే అవకాశంతో ఈ దేశం భారతీయ పర్యాటకులకు పరిపూర్ణమైన సెలవును అందించే గమ్యస్థానంగా ఉంది.
శ్రీలంక పర్యాటక శాఖ మంత్రి హరిన్ ఫెర్నాండో మాట్లాడుతూ, ‘‘విశిష్ట అనుభవాలు, సాంస్కృతిక మరియు భౌగోళిక సామ్యత, అందుబాటు ధరలు ఇవన్నీ శ్రీలంకను భారతీయ పర్యాటకులకు అత్యంత ప్రాధాన్యతలు కలిగిన అంతర్జాతీయ పర్యాటక కేంద్రాల్లో ఒకటిగా నిలిచింది. దీనితో మాస్టర్ కార్డు అందుబాటులోకి తీసుకు వచ్చిన ‘శ్రీలంక విత్ లవ్’ క్యాంపెయిన్ భారతీయ పర్యాటకులకు వారి పర్యటన సమయంలో ఖర్చు చేసేందుకు మరింత మహోన్నతమైన విలువను తీసుకు వస్తుంది. ఈ భాగస్వామ్యం శ్రీలంకను అందుబాటు ధరల్లో వీక్షించేందుకు మరియు సురక్షిత పర్యాటక కేంద్రంగా విశ్వాసార్హతను మరోసారి నిరూపించడంలో సుదీర్ఘంగా ముందంజలోకి వస్తుందన్న నమ్మకం మాకు ఉంది’’ అని పేర్కొన్నారు.
మాస్టర్ కార్డ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ వికాస్ శర్మ మాట్లాడుతూ, ‘ఈ ద్వీప దేశం అందించే విశ్వసార్హమైన మరియు వైవిధ్యమయ అనుభవాలు దాన్ని అత్యంత ప్రాధాన్యతలు కలిగిన సెలవు రోజుల గమ్యస్థానాల్లో ఒకటిగా మార్చింది. జనవరి-సెప్టెంబరు 2022 మధ్య శ్రీలంకకు వచ్చిన అంతర్జాతీయ పర్యాటకుల్లో 16% మంది భారతీయులు ఉన్నారు. అంతే కాకుండా శ్రీలంకలో సామాజిక, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతున్న కొద్దీ మాస్టర్ కార్డ్ భారతదేశంలో మాస్టర్‌కార్డు ఉన్న వినియోగదారులకు అర్థవంతమైన రివార్డులు, అనుభవాలను అందించడం ద్వారా వారికి శ్రీలంకకు మరోసారి భేటీ అయ్యేందుకు లేదా మొదటిసారి సందర్శించేందుకు ఉత్తేజిస్తుంది.
మాస్టర్ కార్డు 2018 నుంచి శ్రీలంక టూరిజం ప్రమోషన్ బ్యూరో (SLTPB)తో భాగస్వామ్యాన్ని కలిగి ఉండగా ప్రముఖ సోర్స్ మార్కెట్లలో ప్రాధాన్యత పర్యాటక కేంద్రంగా ఉత్తేజిస్తోంది. జనవరి 2020లో మాస్టర్ కార్డ తన మాస్టర్‌కార్డ్ టూరిజం ఇన్సైట్ ప్రోగ్రామ్‌ను అందించేందుకు, కొవిడ్-19 అనంతరం శ్రీలంకలో పర్యాటక వలయాన్ని పునరుత్తేజించేందుకు ఎటువంటి ఖర్చు లేని సలహా సేవలను ప్రభుత్వానికి అందించేందుకు ఎస్ఎల్టిపిబితో ఒప్పందాన్ని కుదుర్చుకుంది.