Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : కాబోయే తల్లులు తమ అభిప్రాయాలను పంచుకునేందుకు ఉద్ద్యేశించిన డిజిటల్ పేరెంటింగ్ వేదిక అయిన ''మై' లో సేవలను తెలుగులోనూ అందుబాటులోకి తెచ్చినట్లు ఆ సంస్థ వ్యవస్థాపకులు, సిఇఒ వినీత్ గార్గ్ తెలిపారు. తమ సేవలను దేశ వ్యాప్తంగా విస్తరించే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇప్పటికే తమ యాప్ను 50 లక్షల పైన మంది డౌన్లోడ్ చేసుకున్నారని తెలిపారు. గర్భధారణలో స్త్రీల అనుభవాలు, వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఇతర స్త్రీలతో మైలో యాప్లో చర్చించుకునేందుకు వీలుందన్నారు.