Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బయో అగ్రి కాన్ఫరెన్స్‌లో నిపుణులు
నవ తెలంగాణ - బిజినెస్ బ్యూరో
దేశంలో సేంద్రీయ వ్యవసాయం పెరగాలని నిపుణులు సూచిస్తు న్నారు. భారత్‌లోని బయో అగ్రి ఇన్పుట్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (బిపా) ''భారత దేశం ప్రపంచ దేశాల ప్రకతి ఆధార వ్యవసాయానికి సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్వలను అందించే దేశం'' అనే నినాధంతో బయో అగ్రి 2022 అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌ను ప్రారంభించింది. సురక్షితమైన ఆహారం, ఆరోగ్యం, పర్యావరణం కోసం బయోలాజికల్ వ్యవసాయాన్ని ప్రోత్సహించే కంపెనీల ఆవిష్కరణలు, సాంకేతిక ఆధా రిత ఉత్పత్తులను ప్రదర్శించడంతో పాటు, పాలసీ సమస్యలు, సాంకేతి క ప్రయోజనాలు, వాటాదారుల సవాళ్లపై ఈ కాన్ఫరెన్స్ చర్చిస్తుంది. సేంద్రీయ పంటలపై ఎక్స్పోనూ కూడా ఏర్పాటు చేశారు. బుధవారం ప్రారంభ సెషన్లో పలువురు వక్తలు, అధికారులు మాట్లా డారు. దేశంలో బయో-స్టిమ్యులెంట్ల ఖ్యాతిని మెరుగుపర చాల్సిన అవసరం ఉందని, ప్రపంచం వాటి కోసం భారతదేశం వైపు చూస్తుం దని కేంద్ర వ్యవసాయ మాజీ కమిషనర్ డాక్టర్ మల్హోత్రా అన్నారు. 2025 నాటికి 1.40 కోట్ల హెక్టార్ల భూమిని సేంద్రియ వ్యవసాయం కిందకు తీసుకు రావాలని ప్రభుత్వం యోచిస్తోందని.. ఇది మొత్తం వ్యవసాయ యోగ్య మైన భూమిలో దాదాపు 10 శాతమని నేషనల్ సెంటర్ ఫర్ ఆర్గానిక్ అండ్ నేచురల్ ఫార్మింగ్ (ఎన్సిఒఎఫ్) డైరెక్టర్ డాక్టర్ గగేష్ శర్మ పే ర్కొన్నారు. ప్రస్తుతం ఇది 2శాతంగా ఉందన్నారు. భారతీయ బయో -ఎరువుల మార్కెట్ విలువ రూ.1200 కోట్లుగా ఉందని వెల్లడించారు.