Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : భారత కార్పొరేట్లు విదేశాల్లోనూ ఆస్తులను కూడబెట్టడంలో తేలియాడుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే పలు ఆస్తులను కొనుగోలు చేసిన రిలయన్స్ ఇండిస్టీస్ ముకేష్ అంబానీ తాజాగా దుబాయ్లో 163 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.1350 కోట్ల)తో అత్యంత ఖరీదైన మరో విల్లాను కొనుగోలు చేశారని తెలు స్తోంది. ఆ దేశంలో ఇదే అత్యంత విలువైన ప్రాపర్టీ అని సమాచారం. దుబాయిలోని పామ్ జుమైరాలోఉన్న ఈ విల్లాను అంబానీ గత వారమే కొనుగోలు చేశారని బ్లూమ్బర్గ్ రిపోర్టు చేసింది. ఇదే ప్రాంతంలో మూడు నెలల క్రితం కూడా దాదాపు రూ.643 కోట్లతో ఓ విల్లాను కొనగోలు చేశారు. సింగపూర్లో కూడా ఇటీవల కుటుంబ కార్యాలయాన్ని తెరిచారు. గతేడాది బ్రిటన్లో రూ.600 కోట్లు వెచ్చించి నివాసాన్ని కొనుగోలు చేశారు.