Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చరిత్రలోనే అతి కనిష్టానికి రూపాయి
ముంబయి : భారత చరిత్రలో ఇది వరకు ఎప్పుడూ లేని విధంగా రూపాయి విలువ అతి కనిష్టానికి పడిపోయింది. అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్లో డాలర్‌తో రూపాయి మారకం తొలిసారి 83కు క్షీణించింది. బుధవారం డాలర్‌తో రూపాయి మారకం విలువ ఏకంగా 61 పైసలు కోల్పోయి 83.01కు పడిపోయింది. ఉదయం 82.32 వద్ద ప్రారంభమైన భారత కరెన్సీ రోజంతా ఒత్తిడిని ఎదుర్కొంది. ఇప్పటి వరకు ఇదే రికార్డ్ పతనం కావడం విశేషం. మంగళవారం సెషన్లోనూ 10 పైసలు తగ్గి 82.40 వద్ద ముగిసింది. దేశీయ స్టాక్ మార్కెట్లలో ఒత్తిడి, ఎఫ్ఐఐలు తరలిపోవడం, విదేశీ మారకం నిల్వల్లో తగ్గుదల, వాణిజ్య లోటు పెరుగుదల, డాలర్‌కు డిమాండ్ తదితర పరిణామాలు రూపాయి విలువను బక్కచిక్కెలా చేస్తున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే దేశంలో అనేక దిగుమతి ఉత్పత్తుల ధరలు భారీగా పెరగనున్నాయి. ద్రవ్యోల్బణం ఎగిసిపడి అనేక ఉత్పత్తుల ధరలు పెరిగి ప్రజల కొనుగోలు శక్తి హరించుకుపోనుంది. కాగా.. ఇటీవల డాలర్ విలువ పెరగడం ద్వారానే రూపాయి విలువ తగ్గుతుందని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలు చేసి తీవ్ర విమర్శల పాలయిన విషయం తెలిసిందే.