Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : దేశంలోనంబర్.1 స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ షవోమీ ఇండియా, షవోమీ రెడ్మీ స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల చేతుల్లోకి అత్యుత్తమ ‘5జి ప్లస్’ నెట్‌వర్క్‌ను తీసుకు వచ్చేందుకు భారతీ ఎయిర్‌టెల్‌తో తన భాగస్వామ్యాన్ని నేడు ప్రకటించింది. ఈ వ్యూహాత్మక ఒప్పందంలో భాగంగా, వినియోగదారులు వేగవంతమైన వీడియో కాలింగ్, క్లౌడ్‌లో లాగ్ ఫ్రీ గేమింగ్ మరియు అన్ని షవోమీ మరియు రెడ్మి 5జి మోడళ్లలో వేగంగా డేటా అప్లోడ్ మరియు డౌన్లోడ్లను ఆస్వాదించవచ్చు. అల్ట్రాఫాస్ట్ ఎయిర్టెల్ 5జి ప్లస్ కనెక్టివిటీని పొందేందుకు వినియోగదారులు కేవలం నెట్వర్క్ సెట్టింగ్‌లకు వెళ్లి, తమ ప్రాధాన్యత నెట్‌వర్క్‌ను ఎయిర్టెల్ 5జికి మార్చుకోవాలి. డిజిటల్ అనుభవాల నాణ్యత అత్యంత ముఖ్యమవుతున్న నేపధ్యంలో, పరికరాలు ఇంటర్నెట్ వేగం అనేది వేగంగా మరియు విశ్వసనీయంగా ఉండటం అంతర్లీనంగా ఉంటుంది. రెండేళ్ల కాలంలో, ఎయిర్టెల్ సహకారంతో షవోమీఇండియా తన వినియోగదారులకు మార్పుతో కూడిన వేగవంతమైన సేవలను అందించేందుకు తన పరికరాలపై కచ్చితత్వమైన పరీక్షలను నిర్వహించింది. ఈ ప్రయోగాల ద్వారా, కంపెనీలు అత్యుత్తమ ఫలితాలను అందించేందుకు తీవ్రమైన పరిస్థితుల్లో పనితీరు మరియు స్థిరత్వానికి ప్రాధాన్యతనిచ్చాయి. దీని గురించి షవోమీఇండియా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అనూజ్ శర్మ మాట్లాడుతూ, ‘‘షవోమీఇండియా ఎల్లప్పుడూ మా వినియోగదారుల కోసం సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తూ వచ్చింది. తద్వారా మా వినియోగదారుల భవిష్యత్తు-అవసరాలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కరిస్తూ వస్తోంది. మా మొత్తం 5జి స్మార్ట్‌ఫోన్ పోర్ట్‌ఫోలియో ద్వారా వినియోగదారులు భారతదేశ వ్యాప్తంగా 5జి సేవలను అందుకునేందుకు అవకాశం కలుగుతుంది. ఎయిర్టెల్ భాగస్వామ్యంతో షవోమీసామర్థ్యం అత్యుత్తమ-శ్రేణి సాంకేతికతను అందిస్తూ, మా వినియోగదారులను భారతదేశంలో 5జి విప్లవంలో ముందంజలో ఉంచేందుకు అవకాశం కల్పిస్తుంది. అధిక వేగం, అధిక విశ్వసనీయత మరియు అతి తక్కువ లాటెన్సీతో, 5జి సేవలు మొబైల్ పర్యావరణ వ్యవస్థను కొత్త రంగాల్లోకి విస్తరింపజేస్తాయి’’ అని వివరించారు.
భాగస్వామ్యం గురించి భారతీ ఎయిర్టెల్ డైరెక్టర్ - కన్స్యూమర్ బిజినెస్ శాశ్వత్ శర్మ మాట్లాడుతూ, “ఎయిర్‌టెల్‌లో, మేము 5జి స్వీకరణను కొత్త స్థాయిలకు చేర్చే శక్తివంతమైన సహకారాలతో మొబైల్ అనుభవాలను నిరంతరం మెరుగుపరుస్తున్నాము. అలాగే 5జి ఎకోసిస్టమ్ డ్రైవింగ్‌ను కొనసాగించేందుకు షవోమీతో భాగస్వామ్యానికి మేము సంతోషిస్తున్నాము. మా ఇప్పటికే ఉన్న అన్ని 4జి సిమ్‌లు 5జి సేవలు అందుకునేందుకు అనువుగా ఉన్నాయి. వీటితోనే వినియోగదారులు తమ షవోమీమరియు రెడ్మి హ్యాండ్సెట్లలో ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా 5జి నెట్‌వర్క్‌ను ఎంచుకోవడం ద్వారా అల్ట్రాఫాస్ట్ 5జి సేవలను పొందవచ్చు. మేము ఈ సేవలను మరిన్ని నగరాలను విస్తరించడాన్ని ఇప్పటికే ప్రారంభించాము’’ అని వివరించారు. ప్రపంచంలోని అత్యుత్తమ మొబైల్ టెక్నాలజీని భారతదేశానికి తీసుకురావడంలో గర్వించదగిన చరిత్రను కలిగిన షవోమీఇండియా తన వినియోగదారులకు ఉత్తమ అనుభవాన్ని అందించేందుకు వివిధ ఫ్రీక్వెన్సీ బ్యాండ్లలో పలు నగరాల్లో 5జిఫీల్డ్ పరీక్షలను నిర్వహించింది. అలాగు 5జి అభివృద్ధితో షవోమీ 12 ప్రో, ఎంఐ 11 అల్ట్రా, షవోమీ 11టి ప్రో, షవోమీ 11 లైట్ ఎన్ఇ 5జి, షవోమీ 11i హైపర్‌ఛార్జ్, షవోమీ 11i, ఎంఐ 11టిప్రో, ఎంఐ 11టిప్రో, ఎంఐ 10X ప్రోతదితర హ్యాండ్ సెట్లలోఅపరిమిత అవకాశాలను అన్‌లాక్ చేస్తోంది. మా ఎంఐ 10 వినియోగదారులు తమ ప్రాధాన్య నెట్వర్క్ని మార్చడం ద్వారా అల్ట్రాఫాస్ట్ కనెక్టివిటీని పొందేందుకు అనుమతిస్తుంది. సరసమైన విభాగంలో 5జి అనుభవాన్ని అందించడం, రెడ్మి K50i, రెడ్మి 11 ప్రైమ్ 5జి, రెడ్మినోట్ 11 ప్రో+ 5జి, రెడ్మినోట్ 11టి 5జి, మరియు రెడ్మినోట్ 10టిఫోన్లలో 5జి సేవలు వినియోగించుకునే వినియోగదారులు హై-డెఫినిషన్ కంటెంట్ స్ట్రీమింగ్, ఆటంకం లేకుండా బ్రౌజింగ్, ఇతర సేవలను తక్షణమే అందుకోగలుగుతారు.