Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సైన్యానికి ఉపయోగపడే ఉత్పతుల తయారీ
నవ తెలంగాణ - బిజినెస్ బ్యూరో
భారతదేశంలో ప్రధానంగా డిఫెన్స్, ఏరోస్పేస్, ఉక్కు నిర్మాణాలు, పునరుత్పాదక శక్తి, టెలికాం రంగాలకు సమగ్ర సేవలను అందించడంలో అగ్రగామి అయిన మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ప్రాస్ట్రక్షర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్్) గ్రూప్‌నకు చెందిన ఐకామ్ సంస్థ ప్రపం చంలోని అధునాతన సాంకేతికత, రక్షణ ఆయుధాల తయారీ సంస్థలలో ఒకటైన కారకల్ (ఎడ్జ్ గ్రూపు, యూఏ ఈతో సైన్యానికి ఉపయోగపడే ఉత్పతుల తయారీ కోసం ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జరుగుతున్న ల్యాండ్, నావల్, హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ సిస్టమ్స్ ఎగ్జిబిషన్ డిఫెక్స్‌పో 2022 లో పాల్గొని ఐకామ్, కారకల్ ప్రతినిధులు ఈ ఒప్పందంపై గురువారం సంతకం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ మొదలుపెట్టిన 'మేక్ ఇన్ ఇండియా' పథకంలో భాగంగా, ఐకామ్, కారకల్ సంస్థలు భారతీయ మార్కెట్ కోసం, అలాగే అంతర్జాతీయ ఎగుమతి కోసం స్థానికంగా తయారు చేయబడిన చిన్న ఆయుధాల పూర్తి పోర్ట్ఫోలి యోను అభివృద్ధి చేయడంలో కలిసి పనిచేస్తాయని ఆ వర్గాలు తెలిపాయి. ''భారత రక్షణ పరిశ్రమ నిరంతరం అభివృద్ధి చెందుతోంది. భారతదేశం మేక్ ఇన్ ఇండియా మరియు ఆత్మనిర్భర్ భారత్ కార్యక్ర మాలకు అనుగుణంగా, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న భౌగోళిక రాజకీయ మార్పుల దృష్ట్యా దేశంలోని రక్షణ రంగాన్ని స్వయం సమద్ధిగా మార్చడానికి చేస్తున్న ప్రయాణంలో కారకల్‌తో ఐకామ్ ఒప్పందం మొదటి అడుగు'' అని ఐకామ్ మేనేజింగ్ డైరెక్టర్ పి. సుమంత్ పేర్కొన్నారు.