Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హిందువేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వెల్లడి
హైదరాబాద్ : హింద్వేర్ స్మార్ట్ అప్లయెన్సస్ రిటైల్ రంగం విక్రయాల పై కీలక దృష్టి సారించిన ట్టు పేర్కొంది. ఈ క్రమంలోనే పెద్ద మొత్తంలో ఎక్స్క్లూజివ్ కిచెన్ గ్యాలరీల విస్తరణ చేపడుతున్నట్టు హింద్వేర్ హోమ్ ఇన్నోవేషన్ హోల్ టై డైరెక్టర్, సీఈఓ రాకేష్ కౌల్ తెలిపారు. గురువారం హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లా డుతూ ప్రస్తుత పండుగ సీజన్లో 15 నూతన ఎక్స్క్లూజివ్ కిచెన్ గ్యాలరీలు ప్రారంభిస్తున్నామన్నారు. ఇందులో హైదరా బాద్లో మూడు ఏర్పాటు చేశామని తెలిపారు. 2023 మార్చి ముగింపు నాటికి అదనంగా 30 కిచెన్ గ్యాలరీలను ప్రారంభిం చాలని లక్ష్యంగా పెట్టుకు న్నామన్నారు. ప్రస్తుతం 170 కిచెన్ గ్యాలరీలు ఉన్నాయన్నారు. ఆర్థిక సంవత్సరం ముగింపు కల్లా 200కు చేర్చాలని నిర్దేశించుకున్నామన్నారు. దక్షిణాదిలో 1500 మంది రిటైలర్లతో కూడిన నెట్వర్క్ ఉందన్నారు. ఇందులో తెలంగాణలోనే 250 మంది రిటైలర్లు ఉన్నారన్నారు.