Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డాలర్ ఏ85కి చేరొచ్చు
- నిపుణుల అంచనా
ముంబయి : అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్లో డాలర్‌తో రూపాయి మారకం విలువ మరింత పడిపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. గురువారం సెషన్లో డాలర్‌తో రూపాయి మారకం విలువ రికార్డ్ స్థాయిలో 83.21కి దిగజారిన విషయం తెలిసిందే. కాగా డిసెంబర్ నాటికి ఈ కరెన్సీ విలువ ఏకంగా 85కు పడిపోయే అవకాశాలున్నాయని రాయిటర్స్ పోల్‌లో నిపుణులు పేర్కొన్నారు. ఈపోల్లో 14 మంది బ్యాంకర్లు, విదేశీ కరెన్సీ అడ్వైజర్ల అభిప్రాయాలను సేకరించింది. ప్రస్తుత ఏడాదిలో ఇప్పటి వరకు డాలర్‌తో రూపాయి మారకం విలువ 12 శాతం క్షీణించింది. ఈ ఏడాదిలో రూపాయి రికవరీ కష్టమేనని నిపుణులు అభిప్రాయపడ్డారు. రూపాయి విలువ 83.25-86 మధ్య నమోదు కావొచ్చని అంచనా వేశారు. డిసెంబర్ ముగింపు కల్లా డాలర్‌తో రూపాయి విలువ 85కి తగ్గొచ్చని బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ ఎకనామిస్ట్ మదన్ సబ్నవిస్ పేర్కొన్నారు. దేశీయ స్టాక్ మార్కెట్లలో ఒత్తిడి, ఎఫ్ఐఐలు తరలిపోవడం, విదేశీ మారకం నిల్వల్లో తగ్గుదల, వాణిజ్య లోటు పెరుగుదల, డాలర్‌కు డిమాండ్ తదితర పరిణామాలు రూపాయిని ఒత్తిడికి గురి చేస్తున్నాయని నిపుణులు పేర్కొన్నారు. గురువారం సెషన్లో డాలర్‌తో రూపాయి విలువ 25 పైసలు పుంజుకుని 82.75 వద్ద నమోదయ్యింది.