Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : గడిచిన ఆరు నెలల్లో స్టీల్ ధరలు 40 శాతం తగ్గి టన్ను రూ.57,000కు దిగివచ్చినట్టు స్టీల్మింట్ తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ఎగమతులపై 15 శాతం సుంకం విధించడంతో విదేశీ ఆర్డర్లు తగ్గాయని.. దీంతో ధరలు తగ్గాయని వెల్లడించింది. ఈ ఏడాది ఏప్రిల్లో టన్ను స్టీల్ ధర రూ.78,800గా ఉండగా.. 18 శాతం జిఎస్టితో కలిపి రూ.93,000గా పలికింది. జూన్ చివరి నాటికి ఈ లోహం టన్ను ధర రూ.60,200కు తగ్గి.. సెప్టెంబరు కల్లా రూ.57,000కు పడిపోయిందని పేర్కొంది.