Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రభుత్వ రంగంలోని కెనరా బ్యాంక్ ఆకర్షణీయ ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికం (క్యూ2)లో 89 శాతం వృద్థితో రూ.2,529 కోట్ల నికర లాభాలు సాధించింది. నికర వడ్డీపై అధిక ఆదాయం, అడ్వాన్సుల్లో మెరుగైన వృద్థి ఆర్థిక ఫలితాలకు ప్రధాన మద్దతును అందించాయి. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.1,333 కోట్ల లాభాలు నమోదు చేసింది. గడిచిన క్యూ2లో బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం 18.5 శాతం పెరిగి రూ.7,434 కోట్లకు చేరింది. సెప్టెంబర్ త్రైమాసికం నాటికి బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తులు 205 బేసిస్ పాయింట్లు తగ్గి 6.37 శాతంగా నమోదు కాగా.. ఏడాదికేడాదితో పోల్చితే నికర ఎన్‌పిఎలు 1.04 శాతం నుంచి 0.35 శాతానికి దిగివచ్చాయి.