Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రముఖ మొబైల్ రిటైల్ చెయిన్ బిగ్'సి' తన 250కు పైగా స్టోర్లలో దీపావళి సందర్బంగా ఆకర్షణీయమైన డబుల్ ధమాకా ఆఫర్లను అందిస్తున్నట్లు ప్రకటించింది. ప్రతీ స్మార్ట్ కొనుగోలుపై రూ.1999 విలువగల ఇన్‌బేస్ ఇయర్ బడ్స్‌ను కేవలం రూ.199కి లేదా రూ.3,999 విలువ గల గిజ్మోర్ కాలింగ్ స్మార్ట్‌వాచ్‌ను రూ.999కు అందిస్తున్నట్లు బిగ్‌సి ఫౌండర్, సిఎండి యం బాలు చౌదరి తెలిపారు. దీనితో పాటు ప్రతీ స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై రూ.7900 వరకు ఇన్స్‌స్టాంట్ రాయితీ కల్పిస్తున్నామన్నారు. ప్రత స్మార్ట్ టివి కొనుగోలుపై రూ.11,499 విలువగల ఫింగర్స్ బార్ స్పీకర్ ఊపర్స్తో పాటు రూ.3000 వరకు ఇన్స్‌స్టాంట్ రాయితీ కల్పిస్తున్నామన్నారు. పలు కంపెనీల స్మార్ట్ఫోన్లపై రూ.10వేల వరకు క్యాష్ బ్యాక్ సహా ఎస్బిఐ కార్డుతో చేసే కొనుగోళ్లపై 7.5 శాతం వరకు డిస్కౌంట్‌ను ఇస్తున్నామన్నారు.