Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంటి యాజమానిపైనే ఆధారం
- టాటా ఏఐఏ లైఫ్ అధ్యయనంలో వెల్లడి
ముంబయి : భారత్లో ఇటీవలి కాలంలో మహిళలు అనేక వత్తి రంగాల్లో రాణిస్తున్నారు. కార్పోరేట్ కార్యాలయాల్లో బోర్డ్ రూమ్ల్లోనూ వారు ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. కానీ ఇప్పటికీ మెజారిటీ మహిళలు స్వతంత్య్రంగా ఆర్థిక నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారని టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ అధ్యయనంలో తేలింది. 'మహిళల్లో ఆర్థిక అవగాహన' పేరుతో దేశ వ్యాప్తంగా 18 నగరాల్లో 25-55 సంవత్సరాల వయసులోని 1000 మంది అభిప్రాయాలతో ఈ రిపోర్టును రూపొందించింది. ఆ వివరాలు.. అధికశాతం మంది ఇప్పటికీ ఇంటి యాజమానిపైనే ఆధారపడుతున్నారు. అయితే తమకు అవకాశం వస్తే నిర్ణయాలు తీసుకుంటామని 44శాతం మంది అభిప్రాయపడ్డారు. పని చేసే మహిళల్లో సైతం 59 శాతం మంది సొంత ఆర్ధిక నిర్ణయాలను తీసుకోలేకపోతున్నారు. ఆర్ధిక ప్రణాళిక అనేది నెలవారీ బడ్జెటింగ్ మాత్రమేనని 39 శాతం అభిప్రాయపడుతున్నారు. ఆర్థిక ప్రణాళికను బాగా అర్థం చేసుకున్న 42శాతం మంది మహిళల్లో కేవలం 12శాతం మంది గృహీణులే. అవకాశం వస్తే తమ సొంతం నిర్ణయం తీసుకోగలమని 44శాతం భావిస్తున్నారు. కరోనా అనంతర కాలంలో జీవిత బీమా తప్పనిసరి అని 72 శాతం మంది అభిప్రాయపడ్డారు. ''ఆర్థిక ప్రణాళిక దగ్గరకు వచ్చేసరికి మహిళలు అత్యంత కీలకం. అయినప్పటికీ తమ ప్రాధాన్యతల పట్ల వారికి అతి తక్కువ అవగాహన ఉంది. ఈ అధ్యయనం నుంచి మేము తెలుసుకున్న అంశాలతో మహిళలే లక్ష్యంగా పరిష్కారాలను రూపొందించనున్నాము'' అని టాటా ఎఐఎ లైఫ్ ఇన్సూరెన్స్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ గిరీష్ కల్రా పేర్కొన్నారు.