Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సం వత్సరం జులై నుంచి సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికం (క్యూ2)లో ప్రయివేటు రంగంలోని యెస్ బ్యాంక్ నికర లాభాలు 32.20 శాతం పతనమై రూ. 152.8 కోట్లకు పరిమితమయ్యాయి. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.225.50 కోట్ల లాభాలు సాధించింది. క్రితం క్యూ2లో బ్యాంక్ మొత్తం ఆదాయం రూ.6,394 కోట్లకు పెరిగింది. గతేడాది ఇదే కాలంలో రూ.5,430 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. గడిచిన త్రైమాసికంలో బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం 31.7 శాతం తగ్గి రూ.1,991.4 కోట్లుగా నమోదయ్యింది. బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తులు 14.97 శాతం నుంచి 12.89 శాతానికి తగ్గాయి.