Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
పర్యావరణహిత భవనాల నిర్మాణంలో పరస్పర సహకారం చేసుకోవాలని ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ), తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సౌకర్యాల సంస్థ (టీఎస్ఐఐసీ) ఒప్పందం చేసుకు న్నాయి. హైటెక్స్‌లో జరిగిన గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్-2022లో టీఎస్ఐఐసీ వీసీ అండ్ ఎమ్డీ ఈవీ నర్సింహారెడ్డి, ఐజీబీసీ చైర్మెన్ గుర్మిత్‌సింగ్ అరోరా ఈ ఒప్పంద పత్రాలపై సంతకం చేశారు. పారిశ్రామిక పార్కులు, వ్యాపార, వాణిజ్య భవన సముదాయాలు, ప్రభుత్వ కార్యాలయ భవన సముదాయాలు సహా పలు అంశాలపై పరస్పర సహకారంతో అధ్యయనం చేయాలని నిర్ణయించారు. గ్రీన్ బిల్డింగ్స్ ఆవశ్యకతపై ప్రజల్లో అవగాహన కల్పించాలనీ, వాటి నిర్మాణానికి అవసరమైన మౌలిక సదుపాయాలు, అవకాశాలను ఉమ్మడిగా పరిశీలించాలని ఒప్పందంతో ప్రతిపాదించారు. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు గ్రీన్ బిల్డింగ్స్ నిర్మాణం తప్పనిసరి అవుతున్నదనీ, భవిష్యత్ అవసరాలకోసం ఇప్పటి నుంచే మౌలిక సౌకర్యాలు సమకూర్చుకోవాలని అభిప్రాయపడ్డారు. అలాగే ఆయా భవనాలకు రేటింగ్స్ ఇవ్వడంపై కూడా అధ్యయనం చేయాలని నిర్ణయించారు.