Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మరో తొమ్మిది మందిపై ఆంక్షలు
- రూ.15.75 కోట్ల జరిమానా విధింపు
- ఆర్థిక అవకతవకలపై చర్యలు
ముంబయి : బ్యాలెన్స్ షీట్లలో అవవతవకలకు పాల్పడి న బాంబే డైయింగ్ అండ్ మానుఫాక్చరింగ్ కంపెనీ లిమి టెడ్ సహా ఆ సంస్థల ప్రమోట ర్లు అయినా నుస్లీ ఎన్ వాడి యా, నెస్ వాడియా, జహంగీర్ వాడియాలపై రెగ్యూలటరీ సంస్థ సెబీ రెండేళ్ల పాటు నిషేధం విధిం చింది. ఈ కంపెనీ ఆర్థిక ఫలితాల్లో చేసిన మోసాలపై రూ.15.75 కోట్ల జరిమానా కూడా విధించింది. మరోవైపు బాంబే డైయింగ్‌కు చెందిన స్కాల్ సర్వీసెస్ లిమిటెడ్, వాడియా గ్రూపు కంపెనీ, ఆ సంస్థ డైరెక్టర్లు డిఎస్ గార్గట్, ఎన్‌హెచ్‌డి దంతవాలా శైలేష్ కర్నిక, ఆర్ చంద్రశేఖరన్, బాంబే డైయింగ్ చీఫ్ ఫైనాన్సీయల్ ఆఫీసర్ దుర్గేష్ మెహతాలపై కూడా నిషేధం విధించింది. వారు 45 రోజుల్లో జరిమానా చెల్లించాలని సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజీ బోర్డు ఆఫ్ ఇండియా (సెబీ) శుక్రవారం తన ఆర్డర్లో ఆదేశాలు జారీ చేసింది.
2011-12 నుంచి 2018-19 వరకు బాంబే డైయింగ్ అండ్ మానుఫాక్చరింగ్ (బిడిఎంసిఎల్) వ్యవహారాలపై దర్యాఫ్తు చేసినట్లు సెబీ తెలిపింది. ఈ విచారణలో రూ.2,492.94 కోట్ల అమ్మకాల్లో తప్పుడు లెక్కలకు పాల్పడటంతో పాటుగా రూ.1,302 కోట్ల లాభాలను పెంచి చూపించిందని తేలింది. స్కేల్‌తో డిఎంసిఎల్ చేసుకున్న అవగాహన ఒప్పందంతో ఈ మోసాలకు పాల్పడింది. స్కేల్ విధివిధానాలను కూడా బిడిఎంసిఎల్ రూపొందించిందని గుర్తించింది. స్థూలంగా ఈ కేసులో బాంబే డైయింగ్‌కు రూ.2.25 కోట్లు, నూస్లీ వాడియాక రూ.4 కోట్లు, జహంగీర్ వాడియాకు రూ.5 కోట్లు, నెస్ వాడియాకు రూ.2 కోట్లు, మెహాతకు రూ.50 లక్షలు, స్కేల్‌కు రూ.1 కోటి, ప్రతీ డైరెక్టర్‌కు రూ.25 లక్షల చొప్పున సెబీ జరిమానా విధించింది.