Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : భారత దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మల్టి డిసిప్లీనరీ విద్యా సంస్థల్లో ఒకటైనా మహీంద్రా యూనివర్సిటీలో స్కూల్ అఫ్ లా న్యాయ విద్యకు అంకితం చేయడం జరిగింది. ఈ మేరకు తన మూడేండ్ల ఫ్లాగ్ షిప్ ఎల్ ఎల్ బిని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త యుగం పరిచయం పై ఎల్ ఎల్ బి ఒనేర్స్ కోర్స్ గురించి మహీంద్రా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ యాజులు మెదురి మాట్లాడుతూ.. భారత దేశంలో అతిపెద్ద, అత్యంత చైతన్యవంతమైన వృత్తుల్లో ఒకటిగా ణ్యశాస్త్ర అధ్యాపకులు తమ అభ్యాసాల్లో చురుకైన న్యాయ వ్యవస్థ వైపు దృక్పధాన్ని కలిగి ఉండాలన్నారు. రెండు దశాబ్దాలుగా శిక్షణ పొందిన న్యాయ నిపుణుల డిమాండ్ వేగంగా పెరిగిందన్నారు. ఇటీవలి పరిశ్రమ అంచనాల ప్రకారం,2021లో భారతదేశంలోని ప్రముఖ న్యాయ సంస్థల్లో న్యాయ నిపుణులను నియామకాలలో దాదాపు15- 25శాతం పెరుగుదలను ప్రదర్శిందన్నారు. రాబోయే సంవత్సరాలలో మరిన్ని నియామకాలు జరిగే అవకాశాలు ఉన్నాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. డీన్ స్కూల్ అఫ్ లా ప్రొఫసర్ డాక్టర్ శ్రీధర్ ఆచార్యులు మాట్లాడుతూ.. కొత్త నియంత్రణ విధానాలు, వ్యాల్యూ యాడ్ ఆడిట్ కోర్సులు ఇతర క్రెడిట్ కోర్సులను ప్రతిబింభించే ప్రత్యేక కోర్సులను కలిగి ఉన్న ప్రస్తుత పరిశ్రమ పోకడలను దృష్టిలో ఉంచుకొని ప్రోగ్రామ్ రూపొందించబడిందన్నారు.