Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఎన్ ఎం ఐ ఎం ఎస్ హైదరాబాద్ డైరెక్టర్‌గా డాక్టర్ సిద్ధార్థ్ ఘోష్ నియమితులయ్యారు. తన 22 ఏండ్ల సుదీర్ఘ ప్రయాణంలో డాక్టర్ సిద్ధార్థ ఘోష్ హైదరాబాద్‌లోని ప్రముఖ సంస్థలకు చెందిన అనేక విభాగాలకు నేతృత్వం వహించారు. సంస్థ నిర్మాణం, మానవ వనరుల నిర్మాణం, నాయకత్వం,L&D, మెంటారింగ్, విద్యా పరిశోధన, కృత్రిమ మేధస్సు, మెషీన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్‌పై ఆయనకు మక్కువ ఎక్కువ. వివిధ సంస్థలకు చెందిన అనేక మంది ప్రొఫెసర్లు, డీన్ లకు మార్గనిర్దేశం చేసిన దార్శనికుడు డాక్టర్ సిద్ధార్థ. అనేక మంది విద్యార్థుల కెరీర్ తీర్చిదిద్ది వారు ఆయా రంగాల్లో నిష్ణాతులుగా నిలిచేలా తీర్చిదిద్దారు.
ఈ నియామకం సందర్భంగా ఎన్ ఎం ఐ ఎం ఎస్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ రమేశ్ భట్ మాట్లాడుతూ 'ఎన్నో అవార్డులు గెలుచుకొని అంతర్జాతీయ విద్యావేత్తగా గుర్తింపు పొందిన డాక్టర్ సిద్ధార్థ ఘోష్‌కు మేము స్వాగతం పలుకుతున్నాం. అంతర్జాతీయంగా అద్భుత ప్రతిభను సృష్టించే సంస్థగా రూపాంతరం చెంది ఒక కొలమానంగా నిలిచేందుకు ఉత్తమ ఫ్యాకల్టీ, నాయకత్వం ఉండాలని ఎన్ ఎం ఐ ఎం ఎస్ లో మేము విశ్వసిస్తాం. ఆర్&డీ, ఎఐ, కంప్యూటర్ సైన్స్‌కు సంబంధించిన రంగాల్లో 2 దశాబ్దాలకు పైగా అనుభవం కలిగిన డాక్టర్ సిద్ధార్థ ఎన్ ఎం ఐ ఎం ఎస్ హైదరాబాద్ బోర్డులో డైరెక్టరుగా రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. చదువులకు సంబంధించిన అనేక అంశాల్లో ఆయన ప్రతిభ, సృజనాత్మకతలో క్యాంపస్‌ను మరో ఉన్నత స్థానానికి తీసుకెళ్లేందుకు సాయపడుతుంది` అన్నారు.
ఎన్ ఎం ఐ ఎం ఎస్ హైదరాబాద్ క్యాంపస్ డైరెక్టర్ డా.సిద్ధార్థ ఘెష్, మాట్లాడుతూ.. 'ఇటువంటి గౌరవనీయ సంస్థకు డైరెక్టర్ కావడం నాకు ఎంతో ఉత్సాహంగా ఉంది. ఉత్తమ డీమ్డ్-టూ-బి-యూనివర్సిటీ, బహుళ అంశాల స్పెషలైజేషన్స్‌తో కూడిన బెస్ట్ దీ-స్కూల్‌గా మారే క్రమంలో దాన్ని సాధించేందుకు మేనేజ్మెంట్ సహకారాన్ని నేను ఆశిస్తున్నాను. తన విద్యార్థులను గొప్ప రాయబారులుగా నిలిపి అంతర్జాతీయ వేదికపై సమున్నత సంస్థగా ఎన్ ఎం ఐ ఎం ఎస్ నిలబడుతుందని నేను నమ్ముతున్నాను` అన్నారు.
అరవై రెండు జాతీయ, అంతర్జాతీయ పరిశోధనా పత్రాల ప్రచురణతో పాటు రెండు పుస్తకాలకు సహ రచన చేసి ఎన్నో ప్రశంసలు అందుకున్నారు డాక్టర్ సిద్ధార్థ.