Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హెచ్యూఎల్ ఉత్పత్తుల్లో రసాయనాలు
న్యూఢిల్లీ : ప్రముఖ ఎఫ్ఎంసీజీ కంపెనీ హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ (హెచ్యూఎల్) ఉత్పత్తి చేస్తున్న షాంపుల్లో కేన్సర్ కారకాలు ఉన్నట్లు తేలింది. ఈ కంపెనీకి చెందిన డవ్, ట్రెస్మే, నెక్సస్, సువేవ్, టిగీ తదితర షాంపుల్లో కేన్సర్ కారకాలు ఉన్నట్టు గుర్తించినందున.. ఆ ఉత్ప త్తులను రీకాల్ చేస్తున్నట్టు స్వయంగా హెచ్యూఎల్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో కలుషితమైన ఏరోసోల్ డ్రై షాంపూ ఉత్పత్తుల వినియో గాన్ని నిలిపి వేయాలని వినియోగదారులకు కంపెనీ సూచించింది. వీటిని వినియోగించడం ప్రమాదమంటూ హెచ్చరిక జారీ చేసింది. ఈ విషయాలను ఆ కంపెనీ తన వెబ్సైట్లో పొందుపర్చినట్టు పేర్కొంది. రీకాల్ చేసిన వాటిల్లో అక్టోబరు 2021కి ముందు తయారు చేసిన డ్రై షాంపూ ఏరోసోల్ ఉత్పత్తులున్నాయని తెలిపింది. తమ అంతర్గత పరిశోధనలో ఏరోసోల్స్ ప్రొపెల్లెంట్ కేన్సర్ కారకం బెంజీన్కు మూల మని కనుగొన్నట్టు తెలిపింది.