Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మస్క్‌కు ట్విట్టర్ సిబ్బంది హెచ్చరిక
వాషింగ్టన్ : ట్విట్టర్‌ను ఎలన్ మస్క్ స్వాధీనం చేసుకోనున్న వేళ ఆ కంపెనీ ఉద్యోగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మాస్క్ చేతికి ట్విట్టర్ రాగానే సంస్థలోని 75 శాతం మంది ఉద్యోగులను తొలగించనున్నారనే రిపోర్టుల నేపథ్యంలో మాస్క్‌కు సిబ్బంది కీలక లేఖ రాశారు. తొలగింపు ల యోచన అనైతికమని వారు పేర్కొన్నారు. ఇటీవల డెలావేర్ కోర్ట్ ఆఫ్ ఛాన్సరీ ఎలాన్ మస్క్‌కు డెడ్‌లైన్ విధించిన విషయం తెలిసిందే. అక్టోబర్ 28 సాయంత్రం 5 గంటల లోపు మస్క్ ట్విట్టర్‌ను కొనుగోలు చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో మస్క్ తమ అధినేత అయితే ముప్పు తప్పదనే అంచనాల్లో ఉద్యోగులు లేఖ రాశారు. సంస్థలోని తొల గింపుల యోచనను వ్యతిరేకిస్తున్నారు. ''మాస్క్ యోచన అనాలోచిత మైంది. ఈ ఒప్పందతో సోషల్ మీడియాపై ఖాతాదారులు పెట్టుకున్న నమ్మకం సన్నగిల్లుతుందనే భావన చోటు చేసుకుంది. దీనివల్ల ప్రజల సమాచార అందించడంలో తీవ్ర ముప్పు వాటిల్లుతుంది. వేధింపులు, బెదిరింపులు లాంటి వాతావరణంలో మేం పనిచేయలేం.' అని ఆ లేఖ లో పేర్కొన్నారు. అదే విధంగా పలు డిమాండ్లు చేశారు. ఇంటి నుంచి పని కొనసాగించడంలో తమ ఉద్యోగులకు ప్రయోజనాలు కల్పించాలని కోరారు. అదే విధంగా యాజమాన్యం ఉద్యోగుల పట్ల వారి జాతి, లింగం, వైకల్యం, రాజకీయ విశ్వాసాల ఆధారంగా వివక్ష చూపకూడదని కోరుతున్నామన్నారు.