Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.936 కోట్ల జరిమానా
- ప్లే స్టోర్ ఆధిపత్య ధోరణీపై ఆగ్రహం
న్యూఢిల్లీ: ప్రపంచ టెక్ దిగ్గజం గూ గు ల్కు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండి యా (సీసీఐ) మరోసారి భారీ షాక్ ఇచ్చిం ది.ప్లే స్టోర్ ఆధిపత్య విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అసంబద్ద వ్యాపార విధా నాలకుగాను ఏకంగా రూ. 936.44 కోట్ల జరిమానా విధిస్తూ మంగళ వారం ఉత్తర్వులు జారీ చేసింది. అన్యాయమైన వ్యాపార పద్ధతులకు స్వస్తి చెప్పాలని, మానుకోవాలని ఆ కంపెనీని ఆదేశించింది. భవిష్యత్తు లో తన ప్రవర్తనను సవరించుకోవాలని సూచించింది. మార్కెట్లో గూ గుల్ తన ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తూ ప్లేస్టోర్ పాలసీ నిబంధ నల్ని తుంగలో తొక్కుతూ పేమెంట్ యాప్స్, అండ్ పేమెంట్ సిస్టంను ప్రమోట్ చేస్తుందని సీసీఐ ట్వీట్ చేసింది. ఆ ట్వీట్లో గూగుల్‌కు భారీ మొత్తాన్ని ఫైన్ విధిస్తున్నట్టు వెల్లడించింది. దీంతో వారం రోజుల్లోనే గూగుల్‌కు రెండు సార్లు షాక్ ఇచ్చినట్లయ్యింది. ఇంతక్రితం అక్టో బరు 20న ఆండ్రాయిడ్ మొబైల్ పరి కరాలకు సంబంధించి బహుళ మార్కె ట్లలో దాని ఆధిపత్య స్థానాన్ని దుర్వినియోగం చేసినందుకు కంపెనీ పై రూ.1,337.76 కోట్ల జరిమానా విధించింది. వివిధ అన్యాయమైన వ్యాపార పద్దతులను నిలిపి వేయాలని, మానుకోవాలని ఆదేశించింది.