Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇక మూలధన కల్పనకు స్వస్తి
- ఈ ఏడాది నుంచే ప్రారంభం
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ బ్యాంక్‌లకు కేంద్ర కల్పిస్తున్న మూల ధన కల్పనకు ఇకపై స్వస్తి పలకాలని మోడీ సర్కార్ యోచిస్తోన్నట్టు తెలు స్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచే దీన్ని అమలు చేయనున్నట్లు ఓ ఆంగ్ల పత్రిక రిపోర్టు చేసింది. ప్రభుత్వ రంగ బ్యాంక్ (పీఎస్బీ) సేవలకు ప్రతీ ఏడాది కేంద్ర ప్రభుత్వం మూలధనాన్ని అందిస్తుంది. కాగా.. 2023 మార్చితో ముగియనున్న ఏడాదిలో దీన్ని కొనసాగించ కూడదని ఓ ఆంగ్ల పత్రిక రిపోర్టు చేసింది. అదే జరిగితే ఆర్థిక సంవత్సరం 2007-08 తర్వాత తొలి సారి మూలధన కల్పనకు పీఎస్బీ లు దూరం కానున్నాయి. దీనికి పలు కారణాలున్నాయని ప్రభుత్వ వర్గా లు పేర్కొంటున్నాయి. 2021-22లో పీఎస్బీ లు మెరుగైన ఫలితాలు నమోదు చేశాయని, మొండి బాకీల్లోనూ తగ్గుదలను సాధించాయని.. ఈ క్రమంలోనే ఆర్థిక మద్దతును నిలిపి వేయాలని భావించినట్టు తెలి పాయి. బ్యాంక్‌ల వద్ద సరిపడ మూలధనం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఆయా పీఎస్‌బీలు సొంతగా మార్కెట్ల నుంచి నిధులు సమీకరించే స్థితిలో ఉన్నాయని ఓ అధికారి తెలిపారు. 2022 మార్చి నాటికి పీఎస్‌బీల మొండి బాకీలు 7.6 శాతానికి తగ్గి ఆరేండ్ల కనిష్ట స్థాయి వద్ద నమోదయ్యాయి. 2022 జూన్ తో ముగిసిన త్రైమాసికంలో పీఎస్‌బీల స్థూల లాభాలు రూ. 15,306 కోట్లుగా నమోదయ్యాయి. గతేడాది త్రైమాసికం లాభాలతో పోల్చితే 6 శాతం పెరిగాయి. వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ, విద్యా , నివాస తదితర ప్రాధాన్యత రంగాలకు ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు అధిక మద్దతు ను అందిస్తున్నాయి. తాజా ఆర్థిక మద్దతు నిరాకరణ యోచన వల్ల ఈ రంగాలపై ప్రభావం పడనున్నదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.