Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : కొరియా, ఇటలీకి చెందిన సరికొత్త మెషిన రీలతో అంతర్గత పరిశోధన, అభివృద్థి సౌకర్యాలతో విస్తరణ ప్రణాళిలకల ను రూపొందిం చినట్లు ఫిలాటెక్స్ ఫ్యాషన్ వెల్లడించింది. హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న ఈ సంస్థ నూతన టెక్నలాజీతో అల్లిన సాక్స్‌ల తయారీ, విక్రయంలో నిమగమై ఉన్నట్లు పేర్కొంది. ఇందుకోసం 100 మిలియన్ డాలర్లకు (దాదాపు రూ.820 కోట్లు) విదేశీ నిధులను సమీకరించడానికి బోర్డు కూడా ఆమోదం తెలిపిందని వెల్లడించింది. ఈ నిధులతో సామర్థ్యం పెంపు, ఆధునీకరణ, ఇతర వస్త్రాలు, అనుబంధ ఉత్పత్తుల తయారీని బలోపేతం చేసుకోనున్నట్లు పేర్కొంది.