Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శాన్ఫ్రాన్సిస్కో : ట్విట్టర్ కొనుగోలు ఒప్పందాన్ని శుక్రవారం ముగిస్తామని టెస్లా అధినేత ఎలన్ మస్క్ వెల్లడించారు. ఈ ఒప్పందానికి కావాల్సిన నిధులను సమకూరుస్తున్న బ్యాంకర్లతో ఆయన ఈ విషయాన్ని తెలిపారు. ట్విట్టర్‌ను 44 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ.3.6 లక్షల కోట్లు) కోనుగోలు చేయడానికి ఇది వరకే ఆ సంస్థ మేనేజ్మెంట్తో మస్క్ ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. స్వాధీనం ప్రక్రియ దాదాపు తుది దశకు చేరుకుందని ఆ వర్గాలు తెలి పాయి. ట్విట్టర్‌ను ఎలాన్ మస్క్ స్వాధీనం చేసుకోనున్న వేళ ఆ సంస్థ లోని 75 శాతం మంది ఉద్యోగులను తొలగించనున్నారనే రిపోర్టుల నేపథ్యంలో సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.