Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : దేశ ప్రగతికి బ్లాక్‌చైన్‌ను వినియోగించుకుని భారతదేశంలో శక్తివంతమైన స్టార్టప్ ఎకోసిస్టమ్ ద్వారా తదుపరి భారీ అవకాశాలను సృష్టించుకునే ‘Web3 for India’ (వెబ్3 ఫర్ ఇండియా)ను హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న స్టార్టప్ ఇంక్యుబేటర్ T-Hub (టి-హబ్)లో భారతదేశంలోని ప్రముఖ క్రిప్టో ఇన్వెస్టింగ్ యాప్ CoinSwitch (కాయిన్‌స్విచ్) నేడు ఆవిష్కరించింది. బ్లూ-చిప్ ఇన్వెస్టర్లతో పాటు A16z (ఎ16జడ్), Sequoia Capital (సెక్వియా క్యాపిటల్) మరియు Tiger Global (టైగర్ గ్లోబల్) తదితర సంస్థల మద్దతు పొందిన ఈ క్రిప్టో యూనికార్న్, ఈ ప్రయత్నంతో బ్లాక్‌చెయిన్ మరియు క్రిప్టో సహకారంతో వాస్తవ ప్రపంచంలోని యూజ్కేసులపై అవగాహన కల్పించడాన్ని లక్ష్యంగా నిర్దేశించుకుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరిశ్రమలు మరియు వాణిజ్యం (I&C) మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) శాఖ ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్; T-Hub (టి-హబ్) సీఈఓ శ్రీనివాస్ రావు మహంకాళి (MSR); CoinSwitch (కాయిన్‌స్విచ్) సహ వ్యవస్థాపకుడు మరియు సీఈఓ ఆశిష్ సింఘాల్ సంయుక్తంగా ‘ఇండియాస్ నెక్స్ట్ బిగ్ ఫ్రాంటియర్: Web3 (వెబ్3) మొదటి ఎడిషన్‌ను ప్రారంభించారు. దీన్ని వ్యవసాయం, అగ్రి-ఫైనాన్స్, రవాణా మరియు రికార్డు నిర్వహణకు సంబంధించి వాస్తవ ప్రపంచంలోని సమస్యలను పరిష్కరించే ప్రారంభ దశ భారతీయ స్టార్టప్‌ల వివరాలు కలిగి ఉన్న హ్యాండ్‌బుక్ అని చెప్పవచ్చు. ‘‘భారతదేశం లో 12,000 మందికి పైగా బ్లాక్ చెయిన్ డెవలపర్లు ఉన్నారు - ప్రపంచంలోనే అత్యధికంగా బ్లాక్ చెయిన్ డెవలపర్లు ఉన్న దేశాల్లో ఒకటి.. కాగా, 2021లో Web3 (వెబ్3) కంపెనీలు 49 కొత్త రౌండ్ల నిధులను సేకరించాయి. ఈ ఏడాది కూడా డీల్స్ ఊపు బలంగా కొనసాగుతోంది. "ఇండియా కి బ్లాక్ చెయిన్ రాజధాని గా మారాలి అన్న మా విషన్ కి అనుగుణంగా,". భారతదేశంలో Web3 (వెబ్3) కథనాన్ని రూపొందించడంలో తెలంగాణ కీలక పాత్ర పోషించాలని కోరుకుంటుంది. కాయిన్‌స్విచ్ ‘Web3 ఫర్ ఇండియా’ ఇనీషియేటివ్‌ను మేము స్వాగతిస్తున్నాము. భవిష్యత్తుకు ఉపయోగపడేఈ కార్యక్రమాన్ని మా రాష్ట్రంలో ప్రారంభించడం సంతోషంగా ఉంది’’ అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరిశ్రమలు మరియు వాణిజ్యం (I&C) మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) శాఖ ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ తెలిపారు. T-Hub (టి-హబ్) సీఈఓ శ్రీనివాస్ రావు మహంకాళి (MSR) మాట్లాడుతూ, “CoinSwitch (కాయిన్‌స్విచ్)కు T-Hub (టి-హబ్) భాగస్వామి అయినందుకు సంతోషంగా ఉంది. ఇది వెబ్ 3.0 సముదాయానికి ఒక పెద్ద అడుగు. ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులు, ఎంటర్ప్యూనర్లు, వీసీలు, విశ్వవిద్యాలయాలు, కార్పొరేట్లు మరియు వెబ్ 3.0 ఔత్సాహికుల కోసం తెలంగాణ మరియు T- Hub (టి-హబ్)లను గో-టు లొకేషన్‌గా ఏర్పాటు చేయాలని మేము కోరుకుంటున్నాము. వెబ్ 3.0 నెట్‌వర్క్‌ను రూపొందించేందుకు తెలంగాణ అత్యుత్తమ ఇంజనీరింగ్ ప్రతిభను కలిగి ఉంది. ఇది ప్రపంచవ్యాప్తంగా సంబంధిత కాన్సెప్ట్ కాగా, ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ హబ్‌గా మేము అన్ని విధాలుగా మద్దతు ఇస్తాము’’ అని భరోసా ఇచ్చారు. ‘‘Web3 (వెబ్3) అనేది ఇంటర్నెట్కు భవిష్యత్తు. కళాశాలల నుంచి స్టార్టప్ ఇంక్యుబేటర్ల వరకు, దేశంలోని యువ సాంకేతిక నిపుణులు దీర్ఘావధిలో భారతదేశంలో వాణిజ్యం మరియు వ్యాపారాన్ని ఎలా మారుస్తారో మరియు వారు పరస్పరం ఎలా వ్యవహరిస్తారో, దానికి అనుగుణంగా మార్పుకు దోహదపడే పరికరాలు, అప్లికేషన్లను ఇంటర్నెట్లో నిశ్శబ్దంగా రూపొందిస్తున్నారు. ఈ సాంకేతికతలు అత్యాధునికమైనవి మరియు అధునాతనమైనవి అయినప్పటికీ, తుది వినియోగదారు-అది రైతు, డ్రైవర్ లేదా రిటైల్ కస్టమర్ కావచ్చు-రోజువారీ సమస్యలను పరిష్కరించేందుకు వాటిని ఉపయోగించుకునే విధంగా పరిష్కారాలను రూపొందించారు. ‘Web3 for India’ ప్రయత్నం భారతదేశంలో ఈ నిశ్శబ్ద Web3 (వెబ్3) విప్లవాన్ని నడిపించే స్టార్టప్‌లకు సంబంధించి అవగాహన కల్పించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది” అని CoinSwitch (కాయిన్‌స్విచ్) సహ వ్యవస్థాపకుడు మరియు సీఈఓ ఆశిష్ సింఘాల్ వివరించారు.
CoinSwitch (కాయిన్‌స్విచ్) Web3 (వెబ్3) కమ్యూనిటీ Block By Block (బ్లాక్ బై బ్లాక్) కార్యక్రమంలో దీన్ని ప్రారంభించారు.
డిసెంబర్ 2021లో, తెలంగాణ ప్రభుత్వం మరియు ఒక ఇన్నోవేషన్ మేనేజ్మెంట్ సంస్థ Lumos Labs (లూమోస్ ల్యాబ్స్) భాగస్వామ్యంతో ఇండియా బ్లాక్‌చైన్ యాక్సిలరేటర్‌ను CoinSwitch (కాయిన్‌స్విచ్) ప్రారంభించింది. ఇది భారతదేశంలోని డీప్-టెక్ బ్లాక్‌చైన్ స్టార్టప్‌లకు మద్దతు ఇస్తూ, సన్నద్ధం చేయడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మద్దతు కలిగిన మొదటి ప్రోగ్రామ్‌లలో ఒకటి. తన మొట్టమొదటి మెంటర్షిప్ మరియు ఫైనాన్సింగ్ ప్రోగ్రామ్‌లో భాగంగా, యాక్సిలరేటర్ మే 2022లో 14 ప్రారంభ-దశ Web3 (వెబ్3) స్టార్టప్‌లను షార్ట్‌లిస్ట్ చేసింది. వీటిలో Whrrl (విర్ల్), Print2Block (ప్రింట్ 2 బ్లాక్), Emertech Innovations Pvt (ఎమర్టెక్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్), Blockster Labs Private Limited (బ్లాక్‌స్టర్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్), The-Ally (ది-అల్లీ), Karpine (కార్పైన్), BirthVenue (బర్త్ వెన్యూ), Autify Network (ఆటిఫై నెట్వర్క్), The Indian Art Revolution (TIAR) (ది ఇండియన్ ఆర్ట్ రివల్యూషన్), Eventozo (ఈవెంటోజో), Nibiaa Devices Pvt.Ltd. (నిబియా డివైసెస్ ప్రైవేట్ లిమిటెడ్), MentorPlus (M+) (మెంటార్ప్లస్), Konct (కాంక్ట్), NFTready.tech (ఎన్ఎఫ్టిరెడీ. టెక్) ఉన్నాయి. ఈ స్టార్టప్‌లు ఫిన్‌టెక్, ఎంటర్టైన్మెంట్, సస్టైనబిలిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు టూలింగ్, అగ్రిటెక్, లాజిస్టిక్స్ మరియు హెల్త్‌కేర్‌లలో బ్లాక్‌చైన్ యూజ్-కేసులను అందిస్తాయి.