Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : స్టార్టప్ ఇంక్యుబేటర్ టీహబ్‌లో బ్లాక్ చెయిన్‌ను ఉపయోగించుకుని తదుపరి భారీ అవకాశాలను సృష్టించుకునేందుకు 'వెబ్3 ఫర్ ఇండియా'ను ఆవిష్కరించినట్లు క్రిప్టో ఇన్వెస్టింగ్ యాప్ కాయిన్ స్వీచ్ తెలిపింది. బ్లూచిప్ ఇన్వెస్టర్లతో పాటు ఎ16జడ్, సికియా కాపిటల్, టైగర్ గ్లోబల్ తదితర సంస్థల మద్దతు కలిగిన ఈ క్రిప్టో యూనికార్న్ ప్రపంచంలోని యూజ్కేసులపై అవగాహన కల్పించడాన్ని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు తెలిపింది. ఈ ఏడాది కూడా బ్లాక్ చెయిన్ ఒప్పందాల రాజధానిగా మారాలన్న మిషన్‌కు అనుగుణంగా, దేశంలో వెబ్3 కథనాన్ని రూపొందించడంలో రాష్ట్రం కీలకపాత్ర పోశించాలని కోరుకుటుందని తెలంగాణ ఐటీ, వాణిజ్య శాఖల ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ పేర్కొన్నారు.