Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : వ్యక్తిగత పరిశుభ్రత, పరీ శానిటరీ ప్యాడ్ల తయారీదారు సూత్ హెల్త్‌కేర్ రూ.175 కోట్ల నిధులు సమీకరించినట్లు ప్రకటించింది. తన ప్రస్తుత పెట్టుబడిదారుల నుండి రూ.120 కోట్లు, ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుండి మరో రూ.55 కోట్ల నిధులను అందుకున్నట్లు పేర్కొంది. ఈ నిధులతో బ్రాండ్ తన పంపిణీ మార్గాలను మరింత పెంచుకోవడానికి, టైర్ 2, 3 మార్కెట్లలో మహిళలల్లో తన పరిధిని మరింతగా పెంచుకోవడానికి ఈ మూలధనాన్ని ఉపయోగించుకోనున్నట్లు తెలిపింది.