Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 15 బిలియన్ డాలర్లు తగ్గొచ్చు
న్యూఢిల్లీ: భారత విదేశీ మారకం నిల్వలు మరింత తగ్గొచ్చని రాయిటర్స్ పోల్‌లో నిపుణులు అంచనా వేశారు. వచ్చే రెండు నెలల్లో అంటే.. 2022 డిసెంబర్ ముగింపు నాటికి మరో 15 బిలియన్ డాలర్లు కరిగిపోయే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. ఏడాది క్రితం 642 బిలియన్ డాలర్లుగా ఉన్న మారకం నిల్వలు గడిచిన ఏడాది కాలంలో 118 బిలియన్ డాలర్లు తగ్గిపోయాయి. ఈ కాలంలో డాలర్‌తో రూపాయి మారకం విలువ 12 శాతం క్షీణించి.. అక్టోబర్ 20న ఆల్‌టైం కనిష్టం 83.29కు పడిపోయింది. ఈ ఏడాది ముగింపు నాటికి మారకం నిల్వలు 510 బిలియన్ డాలర్లకు పరిమితం కావొచ్చని 19 మంది ఆర్థిక నిపుణులు అంచనా వేశారు. ప్రస్తుతం ఈ నిల్వలు 525 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.