Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : వచ్చే నెల 7, 8, 9 తేదిల్లో హైదరాబాద్‌లోని హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్లో ఐదవ ఎడిషన్ యునిఫార్మ్ అండ్ గార్మెంట్స్ మాన్యుఫాక్చరర్స్ ఫెయిర్ 2022ను ఏర్పాటు చేస్తున్నారు. సోలాపూర్ గార్మెంట్స్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్, మహవీర్ టెక్స్టైల్ గ్రూప్, సోలాపూర్లు సంయుక్తంగా దీన్ని నిర్వహించనున్నట్లు తెలిపాయి. ఈ ఫెయిర్‌కు సంబంధించిన టీజర్‌ను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ లాంచనంగా ఆవిష్కరించారని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఇక్కడ యునిఫార్మ్స్, ఫ్యాన్సీ గార్మెంట్స్, యునిఫార్మ్ ఫ్యాబ్రిక్ తయారీదారులు తమ ఉత్పత్తులను ప్రదర్శించనున్నారు.