Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఇండియా యొక్క అగ్రగామి టెలీకమ్యూనికేషన్స్ సేవా ప్రదాత అయిన భారతీ ఎయిర్టెల్ (“ఎయిర్టెల్”), తాను తన నెట్వర్క్ పైన 1 మిలియన్ విశిష్ట 5G వాడుకదారు మార్కును అధిగమించి ముందుకు వెళ్ళినట్లుగా నేడు ప్రకటించింది. నెట్వర్క్ సైతమూ ఇంకనూ నిర్మించబడుతూ ఉండగానే, తన వాణిజ్యపరమైన ప్రారంభాన్ని మొదలుపెట్టిన 30 రోజుల లోపునే కంపెనీ ఈ మైలురాయిని సాధించింది.
ఈ నెల మొదట్లో ఎయిర్టెల్, ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, సిలిగురి, నాగపూర్ మరియు వారణాసి నగరాలకు తన 5G సర్వీసుల ఆగమనాన్ని ప్రకటించింది. కంపెనీ తన నెట్వర్క్ నిర్మాణమును కొనసాగిస్తూ మరియు రోలవుట్ ని పూర్తి చేసుకుంటూ ఉండగానే ఈ నగరాలలో ఈ సేవలు దశల వారీగా ప్రారంభించబడుతూ ఉన్నాయి. భారతీ ఎయిర్టెల్, CTO, రణదీప్ సెఖాన్, మాట్లాడుతూ “ఇవి ఇంకా తొలి రోజులే అయినా కస్టమర్ల నుండి స్పందన ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటోంది. ఇప్పుడు అన్ని ఉపకరణాలూ కొన్ని మినహాయింపులను భరిస్తూ ఎయిర్టెల్ 5G ప్లస్ నెట్వర్క్ పైన పనిచేయగల సమర్థతతో ఉన్నప్పటికీ సైతమూ ప్రతిరోజూ మా నెట్వర్క్ నిర్మించబడుతూనే ఉంది, అవి కూడా రానున్న కొద్ది వారాలలో చేయబడతాయి. మొత్తం దేశాన్ని అంతటినీ అనుసంధానించే దార్శనికతో మేము మా నెట్వర్క్ ని ముందుకు తీసుకువెళ్ళడం కొనసాగిస్తాము” అన్నారు. ఎయిర్టెల్ 2021 లో 5G ప్రయోగాలను ప్రారంభించింది మరియు దేశములో వాణిజ్యపరంగా 5G సేవలను ప్రారంభించిన మొదటి ఆపరేటర్ అయింది. ఈ రోలవుట్ మరింత విస్తృతంగా వ్యాప్తి చెందేవరకూ 5G స్మార్ట్ ఫోన్లు గల కస్టమర్లు తమకు ప్రస్తుతం ఉన్న డేటా ప్లానులపై అధిక స్పీడ్ ఎయిర్టెల్ 5G ప్లస్ ని ఆనందించవచ్చు. ప్రస్తుతమున్న ఎయిర్టెల్ 4G సిమ్ కూడా 5G సక్రియమై ఉంది కాబట్టి సిమ్ మార్చవలసిన అవసరం లేదు. ఎయిర్టెల్ 5G ప్లస్ కస్టమర్ల కోసం మూడు నిర్బంధమైన ప్రయోజనపు అవకాశాలు కలిగి ఉన్నాయి. మొదటిది, ఇది అత్యంత అభివృద్ధి చెందిన సానుకూల వ్యవస్థతో ప్రపంచములో అతి విస్తృతంగా స్వీకరించబడిన టెక్నాలజీపై పని చేస్తుంది. ఇండియాలోని అన్ని 5G స్మార్ట్ ఫోన్లు కూడా నిరంతరాయంగా ఎయిర్టెల్ నెట్వర్క్ పైన పని చేసేలా ఇది నిర్ధారిస్తుంది. రెండవది, అత్యుత్తమమైన అనుభవాన్ని అందజేయడానికి కంపెనీ వాగ్దానం చేస్తుంది – అద్భుతమైన వాయిస్ అనుభవం మరియు అత్యంత-వేగమైన కాల్ కనెక్ట్ తో కలగలిసి ఈ రోజు ఉన్నదానికంటే 20 నుండి 30 రెట్లకు ఎక్కువ అధిక వేగాలతో పనిచేస్తుంది. అంతిమంగా, ఎయిర్టెల్ 5G ప్లస్ నెట్వర్క్ తన ప్రత్యేక పవర్ తగ్గింపు పరిష్కారముతో పర్యావరణానికి కూడా హితమైనదిగా ఉంటుంది.
ఎయిర్టెల్ 5G ప్లస్, ఎయిర్టెల్ అందించే మొత్తం సేవల యొక్క విభాగమును బలపరుస్తుంది. దానికి అదనంగా, ఇది హై డెఫినిషన్ వీడియో ప్రసారం, గేమింగ్, మల్టిపుల్ చాటింగ్, ఫోటోలు అప్పటికప్పుడే అప్లోడ్ చేయడం మరియు మరెన్నింటికో అత్యంత వేగమైన ప్రాప్యతను అందజేస్తుంది. ఈ ప్రారంభావిష్కరణతో, ఎయిర్టెల్ 5G ప్లస్ విద్య, ఆరోగ్య సంరక్షణ, తయారీ రంగము, వ్యవసాయం, మొబిలిటీ మరియు లాజిస్టిక్స్ లను విప్లవాత్మకం చేస్తుంది కాబట్టి, ఆర్థికపరమైన ఎదుగుదలకు ఇండియా బాటలు వేసుకుంటుంది.