Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ష్మిత్ ఫ్యూచర్స్ , రోడ్స్ ట్రస్ట్ తో భాగస్వామ్యం చేసుకుని రైజ్ టు క్యాంపెయిన్ ప్రారంభించడం ద్వారా 15 నుంచి 17 సంవత్సరాల (జూలై 01, 2023 నాటికి) వయసు కలిగిన యువత 2023 రైజ్ గ్లోబల్ ఛాలెంజ్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సిందిగా ఆహ్వానిస్తోంది. ష్మిత్ ఫ్యూచర్స్ యొక్క ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం మరియు ఎరిక్ , వెండీ ష్మిత్ యొక్క ఒక బిలియన్ డాలర్ల దాతృత్వ నిబద్ధత ద్వారా అవకాశాల కోసం ఎదురుచూసే మేధావులను రైజ్ కనుగొంది. ఈ మేధావులకు ఇతరులకు సేవలనందించేందుకు తగిన మద్దతు కావాల్సి ఉంది. ఈ కార్యక్రమం ద్వారా ప్రపంచవ్యాప్తంగా 15 నుంచి 17 సంవత్సరాల వయసు కలిగిన ప్రజలను గుర్తించడం లక్ష్యంగా చేసుకున్నారు. దీనిద్వారా వారు జీవితాంతం సేవలను చేయడం మరియు అభ్యసించడం ప్రోత్సహిస్తారు. దీనిలో భాగంగా వారికి స్కాలర్షిప్స్, కెరీర్సేవలు మరియు ఫండింగ్ అవకాశాలను సైతం అందిస్తూ ఈ లీడర్స్ రాబోయే దశాబ్దాలలో ఇతరులకు సేవ చేసేందుకు ప్రోత్సహిస్తుంది. ప్రారంభమైన నాటి నుంచి 170 దేశాల నుంచి 1,50,000 మంది యువతను రైజ్ తమ కమ్యూనిటీకి స్వాగతించింది. వీరి నుంచి 69 దేశాలకు చెందిన 200 మంది విజేతలను ఎంపిక చేసింది. వీరంతా కూడా తమ మేధస్సును ప్రదర్శించారు. గ్లోబల్ వార్మింగ్‌ను తగ్గించేందుకు విద్యను మరింత అందుబాటులోకి తీసుకురావడం దగ్గర నుంచి క్యాన్సర్‌ను అత్యుత్తమంగా గుర్తించేందుకు తగిన ఉపకరణాలను అభివృద్ధి చేయడం వరకూ వీరు తమ ప్రతిభను చూపారు.
‘‘భారతదేశంలో రైజ్‌తో భాగస్వామ్యం వృద్ధి చెందడం పట్ల అవంతి ఫెలోస్ చాలా సంతోషిస్తుంది. అత్యుత్తమ ప్రపంచం నిర్మించేందుకు వెదుకుతున్న భావి తరపు యువ ప్రాబ్లమ్సాల్వర్స్ను కనుగొని వారితో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము’’ అని అక్షయ్ సక్సేనా, కో–ఫౌండర్ అండ్ డైరెక్టర్– అవంతి ఫెలొస్ అన్నారు.
ప్రతిభ అనేది అందరికీ సమానంగానే ఉంటుంది కానీ అవకాశాలు మాత్రం సమానంగా సృష్టించబడవు అని ష్మిత్ ఫ్యూచర్స్ గుర్తిచింది. ఈ కారణం చేతనే రైజ్ ప్రోగ్రామ్ 30కు పైగా అంతర్జాతీయ సంస్ధలతో భాగస్వామ్యం చేసుకుంది. వీటలో ఎన్బీఏ ఆఫ్రికా, యునైటెడ్ వరల్డ్ కాలేజీ (యుడబ్ల్యుసీ), మాంచెస్టర్ యునైటెడ్ ఫౌండేషన్, టీచ్ ఫర్ఆల్, అమిడీస్ట్ మరియు లాటిన్ అమెరికన్ లీడర్షిప్ అకాడమీ వంటివి ఉన్నాయి. వీటి ద్వారా ప్రపంచవ్యాప్తంగా తెలివైన యువతను మరీ ముఖ్యంగా అత్యుత్తమ ప్రపంచం నిర్మించడం పట్ల ఆసక్తి కలిగిన వారిని కనుగొంటుంది.
దరఖాస్తులను తెరువడాన్ని వేడుక చేస్తూ ‘రైజ్ టు’ క్రియేటివ్ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీనిద్వారా అసాధారణ మేథస్సు కలిగిన యువ హృదయాలు తమకు లభించిన అవకాశాలను ఉపయోగించుకుని ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలకు తగిన పరిష్కారాలను రూపొందించి ఎదిగేందుకు ప్రోత్సహిస్తోంది. ఓగ్లీవీ రూపొందించిన ఈ ప్రచారంతో 15–17 సంవత్సరాల యువతకు స్ఫూర్తి కలిగించడంతో పాటుగా అంతర్జాతీయ కమ్యూనిటీని తీర్చిదిద్దడం చేయడం ద్వారా అత్యుత్తమ భవిష్యత్‌ను సృష్టించడంపై కృషి చేయనున్నారు. రైజ్ ఈ కార్యక్రమాల కోసం మల్టీ ప్లాటినమ్ సింగర్–రచయిత బిషప్ బ్రిగ్స్‌తో భాగస్వామ్యం చేసుకున్నారు. ఈమె రివర్ ట్రాక్ ద్వారా సుప్రసిద్ధులు. అత్యంత అందంగా తీర్చిదిద్దిన షాట్ ఫిల్మ్స్, ఆడియో యాడ్స్ ద్వారా ఖ్యాతి గడించడంతో పాటుగా 2021 రైజ్ అంతర్జాతీయ విజేతలతో కనిపించారు. ఈ యాడ్స్ సామాజిక మాధ్యమాల ద్వారా ప్రాచుర్యం పొందడంతో పాటుగా స్పాటిఫై పై కూడా ప్రాచుర్యం పొందాయి. బ్రిగ్స్ యొక్క నూతన సింగిల్ సూపర్ హ్యూమన్ తో ఆమె సిద్ధంగా ఉంది. ఈ పాట ఇటీవలనే విడుదలైంది. నూతన తరపు యువత స్ఫూర్తితో తీర్చిదిద్దారు. మనలో దాగిన ప్రతి సూపర్హ్యూమన్నూ గుర్తించే రీతిలో ఇది ఉంటుంది.