Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగ వృద్థి, సవాళ్ల అంశాలపై హైదరాబాద్ రియల్టర్స్ అసోసి యేషన్, నేషనల్ అసోసియేషన్ ఆఫ్ రియల్టర్స్ సభ్యులు సమాలోచనలు చేశారు. హెచ్ఆర్ఏ 8వ వ్యవస్థాపక దినోత్సవం సందర్బంగా హైదాబాద్ లో ఏర్పాటుచేసిన జాతీయ స్థాయి సమావేశంలో పలు అంశాలపై చర్చించినట్లు ఆ వర్గాలు తెలిపాయి. రియల్ ఎస్టేట్ రంగంలోని వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలు లక్ష్యంగా ఈ సమావేశాలు జరిగాయని పేర్కొన్నాయి. బ్రోకరు, డెవలపర్ సంబంధాల పాత్రను మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశామని ఎన్ఏఆర్ ఇండియా ప్రెసిడెంట్ సమీర్ అరోరా పేర్కొన్నారు. ఈ రంగంలో మరింత నైపుణ్యత అవసరమని హెచ్ఆర్ఎ ప్రెసిడెంట్ అమర్ శ్రీనివాస్ అన్నారు.