Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూయార్క్ : ట్విట్టర్లో 3700 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికే అవకాశాలున్నాయని బ్లూమ్బర్గ్ తాజాగా రిపోర్టు చేసింది. దాదాపు సగం మంది ఉద్యోగులను సాగనంపాలని మస్క్ యోచిస్తున్నారని తెలిపింది. దీనిపై ఈ వారాంతంలోనే ఆయా ఉద్యోగులకు సమాచారం అందించను న్నారని వెల్లడించింది. ఉద్యోగుల తొలగింపులు ఉండబోవని తొలుత మాస్క్ ప్రకటించినప్పటికీ.. ప్రారంభంలోనే సిఇఒ, పాలసీ హెడ్లకు ఉ ద్వాసన పలికారు. మస్క్ భయాలతో కొన్ని నెలలుగా వందలాది మంది కంపెనీని విడిచిపెట్టారని ఇటీవల రిపోర్టులు వచ్చాయి. ఈ సంస్థలో మొ త్తం 7,500 మంది ఉద్యోగులు ఉండగా.. జనవరి నుండి ఇప్పటి వరకు 1,100 మందికి పైగా కంపెనీని వదిలేశారని అంచనాలు వెలుపడ్డాయి.