Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హెచ్డిఎఫ్సి ఛైర్మన్ వెల్లడి
న్యూఢిల్లీ : దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతింటున్నాయని హెచ్డిఎఫ్సి ఛైర్మన్ దీపక్ పరేక్ పేర్కొన్నారు. ప్రపంచం ఏకకాలంలో అనేక పెను విపత్తులను ఎదుర్కొంటోందన్నారు. కొల్కత్తాలో జరిగిన ఓ పారిశ్రామికవేత్తలతో పరేక్ మాట్లాడుతూ.. దేశాల మధ్య విశ్వాసలేమి, గ్రూపులు కట్టడం వంటివి ఎంతగానో పెరిగిపోయాయన్నారు. ఆర్థిక సవాళ్ల కన్నా నిరంకుశ శక్తులు, సహకార కొరవడటం, వాణిజ్యాన్ని ఆయు ధంగా మార్చుకోవడం వంటివే ప్రపంచానికి అతి పెద్ద సమస్యలుగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. వరుస సంక్షోభాలు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను దెబ్బతీస్తున్నాయన్నారు. అధిక ద్రవ్యోల్బణం మరికొంత కాలం కొనసాగవచ్చన్నారు.