Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : భారతదేశంలో సుప్రసిద్ధ ఎలక్ట్రికల్ గూడ్స్ కంపెనీ, పాలీక్యాబ్ ఇండియా లిమిటెడ్ (పీఐఎల్) ఇప్పుడు దేశంలో కేబుల్స్ మరియు వైర్స్ ల్యాండ్‌స్కేప్‌ను సమూలంగా మార్చడానికి సిద్ధం కావడంతో పాటుగా తమ తాజా టెలివిజన్ కమర్షియల్ ను విడుదల చేసింది. దీనిద్వారా ప్రతి ఒక్కరి భద్రత మరియు సంక్షేమం కోసం తమ పాలీక్యాబ్ గ్రీన్ వైర్ వినియోగాన్ని ప్రచారం చేస్తుంది.
‘ఎక్స్ట్రా సేఫ్ వైర్ అంటే ఎక్స్ట్రా సేఫ్ డ్రీమ్స్ ’అంటూ చేస్తోన్న పాలీక్యాబ్ ప్రచారం వినూత్నంగా ఉండటంతో పాటుగా నేటి తరపు వినియోగదారులకు వైర్లు మరియు కేబుల్స్ యొక్క విలువ ప్రతిపాదనలను గురించి తెలుపుతుంది. దానితో పాటుగా ఈ ఉత్పత్తుల ప్రయోజనాలనూ వివరిస్తుంది. ఈ ప్రచారం ద్వారా వైర్ల నాణ్యత పట్ల ప్రజలు మరింత ఆప్రమప్తతతో వ్యవహరించాల్సిందిగా చెబుతూనే అత్యంత శక్తివంతమైన మానవ కథలను ప్రదర్శిస్తోంది.
ఈ కథల ద్వారా కేవలం ఎక్స్ట్రా సేఫ్ పాలీక్యాబ్ గ్రీన్ వైర్లను ఊహాతీత లోడ్‌ను సైతం తట్టుకునేలా తీర్చిదిద్దారు. తద్వారా మీ కలలును సురక్షితంగా ఉంచడంలో ఏ విధంగా సహాయపడగలమని ప్రదర్శిస్తున్నారు.
వైర్లు మరియు దాని ప్రయోజనాల విలువ ప్రతిపాదనలను తెలియజేస్తూనే ఈ చిత్రం ఓ ఔత్సాహిక బాడ్మింటన్ ప్లేయర్ చుట్టూ తిరుగుతుంది. ఆమె తన తండ్రితో రాత్రిపూట స్టేడియంలో స్పేస్ లభ్యత ఏ విధంగా లేదో చెబుతుంది. ఈ కథలో ఆమె తండ్రి ఏ విధంగా పాలీక్యాబ్ గ్రీన్ వైర్ ఉపయోగించి బ్యాక్‌యార్డ్ స్టేడియం సిద్ధం చేశారో వివరిస్తారు. ఆ తండ్రి కుమార్తెకు ఈ స్టేడియం ఆనందం కలిగించడం మాత్రమే కాదు, తన తండ్రికి కృతజ్ఞతలు చెబితే సరిపోదని వెల్లడిస్తుంది.
పాలీక్యాబ్ ఇండియా లిమిటెడ్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అధ్యక్షులు నీలేష్ మలానీ మాట్లాడుతూ ‘‘వైర్స్ మరియు కేబుల్స్ విభాగంలో వైవిధ్యమైన మార్కెట్ అగ్రగామిగా నిలువడంతో పాటుగా విస్తృత శ్రేణి ప్రశంసలను సైతం పాలీక్యాబ్ ఇండియా పొందింది. ఎలాంటి ఇంటిలో అయినా మొత్తం విద్యుత్ వ్యవస్ధలకు వెన్నుముకగా వైర్లు నిలుస్తుంటాయి. అయితే వినియోగదారులకు ఇది అతి తక్కువ పెట్టుబడి విభాగం. మా తాజా ప్రచారాన్ని ఓగ్లీవీ రూపొందించింది. ఇది తాజాగా ఉండటం మాత్రమే కాదు సార్వత్రికంగా ప్రతిధ్వనిస్తూనే భావోద్వేగాలను అంతే హృద్యంగా చూపుతుంది. పాలీక్యాబ్ గ్రీన్ వైర్లు 5 ఇన్ 1 గ్రీన్ షీల్డ్ సాంకేతికతను కలిగి ఉండటంతో పాటుగా అగ్ని ప్రమాదాల నుంచి భద్రతను సైతం అందిస్తాయి. ఇవి విద్యుత్ పొదుపు చేయడంతో పాటుగా సుదీర్ఘకాలం నిలిచి ఉంటాయి. ఇవి పర్యావరణ అనుకూలంగా ఉండటంతో పాటుగా షాక్ ప్రొటెక్షన్ కలిగి ఉంటాయి. పాలీక్యాబ్ గ్రీన్ వైర్లు బ్రాండ్ యొక్క వాగ్ధానం అయిన మా వినియోగదారులో అనుసంధానితమై ఉండటాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తుంది’’ అని అన్నారు.
పాలీక్యాబ్ ఇప్పుడు స్టార్ స్పోర్ట్స్‌పై ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ కు అసొసియేట్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. క్రికెట్ ప్రేమికులు ఈ యాడ్‌ను డిస్నీ హాట్‌స్టార్ యాప్‌పై చూడవచ్చు దీనిని కనెక్టడ్ టీవీ ద్వారా కూడా చూడవచ్చు. ‘ఎక్స్ట్రా సేఫ్ పాలీక్యాబ్ గ్రీన్ వైర్’ అంటే ఎక్స్ట్రా సేఫ్ డ్రీమ్స్ చిత్రం ను భారతదేశ వ్యాప్తంగా 100కు పైగా టీవీ ఛానెల్స్‌లో ఆరు భాషలలో సాధారణ వినోదం, న్యూస్, మూవీస్, టీవీలలో పాపులర్ షోలలో ప్రసారం చేయనున్నారు.
ఓగ్లీవీ ఇండియా ఫ్ క్రియేటివ్ ఆఫీసర్ సుకేష్ నాయక్ మాట్లాడుతూ ‘‘కలలకు హద్దులనేవీ ఏమీ ఉండవు. ఈ హ్యూమన్ క్యాంపెయిన్‌తో, పాలీక్యాబ్ ఎక్స్ట్రా సేఫ్ గ్రీన్ వైర్లు ఏ విధంగా అప్రయత్నంగానే అనుసంధానించబడిన లోడ్‌ను తీసుకువెళ్లడంతో పాటుగా మనకలలను సాకారం చేస్తాయో చెబుతున్నాము. అవి మన ఇళ్లను మన కలలను సురక్షితంగా ఉంచుతున్నాయో వెల్లడించాము’’ అని అన్నారు.