Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విదేశాల్లో చదువాలనుకునే వారికి ఉపయుక్తం
- పాల్గొననున్న 30కి పైగా యూకే విశ్వవిద్యాలయాలు
హైదరాబాద్ : యూకేకు చెందిన అంతర్జాతీయ విద్యా సలహాదారు సంస్థ, విశ్వసనీయ యూకే విశ్వవిద్యాలయ భాగస్వామి ఎస్ఐ - యూకే ఇండియా (SI – UK India), యూకేలో చదువుకోవాలనుకునే విద్యార్థుల కోసం హైదరాబాద్‌లో ఎస్ఐ-యూకే యూనివర్సిటీ ఫెయిర్‌ను నిర్వహిస్తోంది. మంగళవారం ఉదయం 11.00 నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు బేగంపేట తాజ్ వివంత హోటల్ లో ఈ ఫెయిర్ జరుగుతుంది.
ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్ లో పాల్గొనే దాదాపు 30కి పైగా యూకే విశ్వవిద్యాలయాలు ఔత్సాహిక భారతీయ విద్యార్థులకు, వారి కుటుంబాలకు అంతర్జాతీయ విద్యా ప్రణాళికలను పటిష్టం చేయడానికి అవసరమైన అన్ని మార్గదర్శకాలు, సమాచారాన్ని అందిస్తుంది. విదేశాలలో చదువుకోవడం అనేది సంక్లిష్టమైన ప్రక్రియ అనే విషయాన్ని దృష్టిలో వుంచుకొని, విద్యార్థులు యూకేలో చదువుకోవడం గురించి అలాగే వారు తెలుసుకోవలసిన ప్రతి విషయాన్ని అర్థం చేసుకోవడానికి యూకే నుండి వచ్చే ప్రముఖ విద్యాసంస్థల ప్రతినిధులు, ఫ్యాకల్టీ సభ్యులు, విద్యార్థులూ వారి కుటుంబసభ్యులతో ముఖముఖి సమావేశానికి అవకాశము ఉంటుంది. విద్యార్థుల ప్రాధాన్య విద్యాసంస్థల గురించి మరింత ప్రామాణికమైన సమాచారాన్ని కోరుకునే అభ్యర్థులకు నిపుణుల కౌన్సెలింగ్ అందుబాటులో ఉంచబడుతుంది. ఇంకా, ఈ ఫెయిర్ వారి నిర్దిష్ట సందేహాలు, ఆందోళనలను పరిష్కరించడానికి, విద్యార్థులు ఎంపిక చేసుకున్న విశ్వవిద్యాలయాలు, సంస్థలకు నేరుగా యాక్సెస్‌ను కూడా ఈ ఫెయిర్ సులభతరం చేస్తుంది.
ఈ ఫెయిర్ గురించి ఎస్ఐ - యూకే ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ లక్ష్మీ అయ్యర్ మాట్లాడుతూ, "విదేశాల్లో చదువుకోవాలనే ఆసక్తి ఉన్న వారందరికీ ఉత్తమ మార్గదర్శకులుగా, ఫెసిలిటేటర్లుగా ఉండాలని మేము ఆశిస్తున్నాము. యూకే అంతర్జాతీయీకరణలో అగ్రగామిగా ఉంది, దాని విశ్వవిద్యాలయాలు అందించే అధిక నాణ్యత గల విద్యకు ప్రపంచ స్థాయి ఖ్యాతి ఉంది. అందువల్ల చాలా మంది భారతీయ విద్యార్థులు యూకేలో చదువుకోవడానికి ఎంచుకుంటున్నారు. ప్రతి సంవత్సరం గడిచేకొద్దీ వారి సంఖ్య పెరుగుతూనే ఉంది". విద్యార్థులు www.ukunifair.in వెబ్సైట్ ను సందర్శించి తమ సెషన్‌ను బుక్ చేసుకోవచ్చు. ఎస్ఐ - యూకే సంస్థ ప్రతినిధులతో సంభాషించవచ్చు.