Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : అగ్రశ్రేణి వ్యాపార సంస్థల గ్రూప్ 'టైల్స్ మార్ట్'కు చెందిన 11వ షోరూం శనివారం హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఘనంగా ప్రారంభమైంది. క్రెడారు నేషనల్ వైస్ ప్రెసిడెంట్ గుమ్మి రామ రెడ్డి, ఏజిఎల్ టైల్స్ డైరెక్టర్ శౌనక్ పటేల్, తెలంగాణ ఎన్ఈఆర్డీసీఓ ప్రెసిడెంట్ సునీల్ చంద్రా రెడ్డి, తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రావు, వాసవి గ్రూప్ చైర్మన్ యర్రం విజరు కుమార్ సంయుక్తంగా ఈ నూతన షోరూంను ప్రారంభించారు. ఈ సందర్భంగా టైల్స్మార్ట్ అధినేతలు సుబ్బరాజు, జివీకే జగ్గారావు మాట్లాడుతూ... ప్రతిష్టాత్మకమైన తమ టైల్స్ మార్ట్ గ్రూపుకు చెందిన ఎక్స్‌క్లూజివ్ టైల్స్ షోరూం ఈ ఏజిఎల్ టైల్స్ షోరూం అని తెలిపారు. హైదరాబాద్‌లో ఏజిఎల్ టైల్స్‌కు ఇది తొలి షోరూం అని తెలిపారు. తెలంగాణ ఎం ఎల్ సి బొగ్గారపు దయానంద్ , టూరిజం డిపార్ట్మెంట్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస గుప్త, బిఎన్ఐ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ సంజన షా, ఏపిఆర్ గ్రూప్ చైర్మన్ ఆవుల కృష్ణారెడ్డి ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా విచ్చేశారు.