Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) ఆకర్షణీయ ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జులై నుంచి సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికం (క్యూ2)లో 58.7 శాతం వృద్థితో రూ.3,313 కోట్ల లాభాలు నికర లాభాలు సాధించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.2,088 కోట్ల లాభాలు నమోదు చేసింది. అడ్వాన్సుల్లో మెరుగైన పెరుగుదల ఉండటంతో గడిచిన క్యూ2లో నికర వడ్డీ ఆదాయం (ఎన్ఐఐ) 34.5 శాతం పెరిగి రూ.10,714 కోట్లకు చేరింది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఎన్ఐఐ రూ.7,566 కోట్లుగా నమోదయ్యింది. క్రితం క్యూ2 నాటికి బ్యాంక్ స్థూల ఎన్‌పిఎలు 95 బేసిస్ పాయింట్లు తగ్గి 5.31 శాతానికి తగ్గాయి. నికర ఎన్పీఏలు 42 బేసిస్ పాయింట్లు తగ్గి 1.16 శాతానికి పరిమితమయ్యాయి.