Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : నేత్ర ఆరోగ్య విభాగంలో అంతర్జాతీయంగా అగ్రగామి సంస్థ కావడంతో పాటుగా జాన్సన్ అండ్ జాన్సన్ మెడ్‌టెక్‌లో భాగమైన జాన్సన్ అండ్ జాన్సన్ విజన్ మరియు లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ నేడు తమ పాఠశాల ఆధారిత కంటి ఆరోగ్య కార్యక్రమం సైట్ ఫర్ కిడ్స్ కార్యక్రమ 20 వ వార్షికోత్సవాన్ని వేడుక చేశాయి. జాన్సన్ అండ్ జాన్సన్ విజన్ మరియు లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్లు 2002లో ప్రారంభించిన సైట్ ఫర్ కిడ్స్ కార్యక్రమం ద్వారా అల్పాదాయ మరియు తగిన రీతిలో సేవలను పొందని కమ్యూనిటీకి చెందిన చిన్నారులకు సమగ్రమైన కంటి ఆరోగ్య సేవలను అందించడం ద్వారా కంటి సంరక్షణ అందుకోవడంలో అంతరాలను పూరించడం లక్ష్యంగా చేసుకున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పశ్చిమబెంగాల్లోని కోల్‌కతాలో 500 మందికి పైగా చిన్నారుల కోసం కంటి పరీక్షలను నిర్వహించారు. రెండు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమం లయన్స్ సఫారీ పార్క్ మరియు కలకత్తా గ్రేటర్ విద్యా మందిర్ స్కూల్లో జరిగాయి. సుప్రసిద్ధ కంటి సంరక్షణ ప్రొఫెషనల్స్, స్థానిక ఆప్తమాలాజికల్ అసోసియేషన్లు, ఎన్జీఓ/కమ్యూనిటీ భాగస్వాములు, జాన్సన్ అండ్ జాన్సన్ విజన్ ప్రతినిధులు, స్ధానిక లయన్స్ సైతం పాల్గొన్నారు. సైట్ ఫర్ కిడ్స్ కార్యక్రమాన్ని పశ్చిమబెంగాల్ వ్యాప్తంగా 2004 నుంచి నిర్వహిస్తున్నారు. గత 20 సంవత్సరాల కాలంలో, ఈ ప్రోగ్రామ్ 42 మిలియన్ల మంది విద్యార్థులకు చేరువైంది. వీరిలో ఆసియా, ఆఫ్రికా, యుఎస్‌లకు చెందిన నిరుపేద వర్గాల చిన్నారులు సైతం ఉన్నారు. ప్రపంచవ్యాప్తగా 6 లక్షల మందికి పైగా చిన్నారులకు కంటి ఆరోగ్య చికిత్సను సైతం అందించింది. భారతదేశంలో కమ్యూనిటీ, స్కూల్ ఆధారిత నమూనాలో సైట్ ఫర్ కిడ్స్ దాదాపుగా 37 మిలియన్ల మంది చిన్నారులకు నేత్ర పరీక్షలు చేసింది. ఈ కార్యక్రమంలో క్రిటికల్ టూల్స్‌తో కూడిన కమ్యూనిటీలు సైతం ఉండటం వల్ల స్పష్టమైన, ఆరోగ్యవంతమైన దృష్టి కోసం కంటి చికిత్సను పొందడం సాధ్యమైంది.
భారతదేశంలో కంటి ఆరోగ్య అవగాహన మెరుగుపరచాలనే సంస్థ యొక్క లక్ష్యంను పునరుద్ఘాటించిన జాన్సన్ అండ్ జాన్సన్ విజన్ , విజన్ కేర్ ఇండియా బిజినెస్ యూనిట్ డైరెక్టర్ టినీ సేన్‌గుప్తా మాట్లాడుతూ ‘‘లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్‌తో భాగస్వామ్యం చేసుకోవడం మరియు ఇప్పుడు 20 సంవత్సకాల సైట్ ఫర్ కిడ్స్ మైలురాయిని వేడుక చేయడంను ఓ గౌరవంగా భావిస్తున్నాము. తొలి దశ బాల్యపు అభివృద్ధిలో ఆరోగ్యవంతమైన నేత్ర దృష్టి అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తోంది. చిన్నారుల విద్యా ప్రదర్శన మొదలు కో–కరిక్యులర్ యాక్టివిటీస్‌లోనూ వారి ప్రతిభ మెరుగుపడటంతో పాటుగా ఆత్మవిశ్వాసం సైతం మెరుగుపడుతుంది. అయితే, అంతర్జాతీయంగా 312 మంది మిలియన్ల మంది చిన్నారులు మియోపియా తో బాధపడుతున్నారు. వీరిలో సగం మంది ఆ సమస్యను గుర్తించకుండానే ఉండి పోవడంతో పాటుగా చికిత్స కూడా తీసుకోవడం లేదు. ప్రతి చిన్నారి ఈ ప్రపంచాన్ని స్పష్టంగా చూసే అవకాశం ఉంది. సైట్ ఫర్ కిడ్స్ ద్వారా మేము కేవలం ఉచిత కంటి సంరక్షణను చిన్నారులకు చేరువ చేయడం మాత్రమే కాకుండా అవసరమైన వారికి చేరువచేస్తున్నాము. అదే సమయంలో పాఠశాల టీచర్లకు సైతం శిక్షణ అందించి నేత్ర సంబంధిత సమస్యలు లేదా కంటి సమస్యలతో బాధపడుతున్న వారిని గుర్తించేలా తోడ్పడుతున్నాము’’ అని అన్నారు.
‘‘ఇప్పటి వరకూ సైట్ ఫర్ కిడ్స్ కార్యక్రమం ద్వారా 5,00,000 వేల జతల ఐ గ్లాసెస్‌ను ప్రపంచవ్యాప్తంగా చిన్నారులకు అందించాము. తద్వారా వారి కలలను సాకారం చేశాము’’ అని అన్నారు.
కంటి సంరక్షణను మరింత మెరుగ్గా పొందాల్సిన ఆవశ్యకత గురించి లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ షౌండేషన్ మూడవ వైస్ ప్రెసిడెంట్ శ్రీ ఏ.పీ.సింగ్ మాట్లాడుతూ ‘‘ జాన్సన్ అండ్ జాన్సన్ విజన్‌తో కలిసి మా లయన్స్ మరియు నేత్ర సంరక్షణ నిపుణులు కలిసి సమగ్రమైన కంటి సంరక్షణ సేవలను స్పష్టమైన మరియు ఆరోగ్యవంతమైన విజన్‌తో నిరుపేద చిన్నారులకు అందించాలనే మా లక్ష్యం చేరువయ్యేందుకు కృషి చేస్తుండటం పట్ల సంతోషంగా ఉంది. మా విస్తృత స్థాయి కార్యక్రమాలతో మేము ఉపాధ్యాయులకు చిన్నారులలో ప్రవర్తనా పరమైన మార్పులును గుర్తించే వినూత్న అవకాశాలు ఉన్నాయని గుర్తించాము. మరీ ముఖ్యంగా నేత్ర సంబంధిత లోపాలతో వారు బాధపడుతున్నప్పుడు వారు ముందుగా గుర్తించగలరని తెలుసుకున్నాము. అది దృష్టిలో పెట్టుకునే ప్రపంచ వ్యాప్తంగా 2 లక్షల మంది టీచర్లకు శిక్షణ అందించాము’’ అని అన్నారు.
ప్రపంచంలో సుదీర్ఘకాలంగా నిర్వహించబడుతున్న పబ్లిక్–ప్రైవేట్ విజన్ స్ర్కీనింగ్ కార్యక్రమం సైట్ ఫర్ కిడ్స్. ఇది ఉపాధ్యాయులకు కంటి ఆరోగ్య విద్యకు అవసరమైన శిక్షణ అందించడంతో పాటుగా సాధారణ కంటి పరిస్ధితులలో విజువల్ యాక్యుటీ టెస్ట్‌లను ఆప్టోమెట్రిస్ట్ల మద్దతుతో నిర్వహిస్తుంది. జాన్సన్ అండ్ జాన్సన్ విజన్ ఇప్పుడు లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్‌తో భాగస్వామ్యం చేసుకుని దేశవ్యాప్తంగా చిన్నారులను చేరువ కావడంతో పాటుగా ఆరోగ్యవంతమైన నేత్రదృష్టిని అందిస్తుంది మరియు కంటి సంరక్షణ పరంగా సమానత్వం తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది.