Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : సుప్రసిద్ధ యూనివర్శిల్ బ్యాంకులలో ఒక టైన బంధన్ బ్యాంక్ ప్రత్యేకంగా, పరిమితకాలం పాటు అందుబాటులో ఉండే, అత్యధిక వడ్డీ రేటు అందించే ఫిక్స్డ్ డిపాజిట్ పథకం విడుదల చేసింది. ఈ వడ్డీరేట్లు రెండు కోట్ల రూపాయల వరకూ కలిగిన డిపాజిట్లపై వర్తిస్తాయి. ఇది నవంబర్ 07,2022 నుంచి అందుబాటులో ఉంటుంది. తాజా డిపాజిట్లపై మాత్రమే కాకుండా ఇప్పటికే మెచ్యూర్ అయిన డిపాజిట్ల రెన్యువల్స్ పై కూడా ఇది వర్తిస్తుంది. ఈ నూతన ఆఫర్‌తో బ్యాంక్ ఇప్పుడు బ్యాంకింగ్ రంగంలో అత్యధిక వడ్డీరేట్లను ఫిక్స్డ్ డిపాజిట్లపై అందిస్తున్నట్లయింది. ఈ పెంపుతో , వినియోగదారులు అత్యధికంగా 7.5% వడ్డీరేటును 600 రోజుల డిపాజిట్లపై పొందగలరు. సీనియర్ సిటిజన్లు అదనంగా 0.50%లేదా 50 బీపీఎస్ పాయింట్లను పొందగలరు. ఇది వారి రిటర్న్స్‌ను 600 రోజుల కాల వ్యవధి ఎఫ్డీలపై 8% వరకూ వడ్డీ పొందేందుకు తోడ్పడుతుంది. ఈ బ్యాంక్ ఇప్పుడు ఒక సంవత్సర కాల వ్యవధి లోపు ఎఫ్డీలపై సీనియర్ సిటిజన్లకు 0.75% లేదా 75బీపీఎస్ అధిక వడ్డీరేటును అందిస్తుంది. బంధన్ బ్యాంక్ ప్రస్తుత ఖాతాదారులు ఇప్పుడు తమ ఇల్లు లేదా ఆఫీస్‌ల నుంచి రిటైల్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా ఎం బంధన్ మొబైల్ యాప్ ద్వారా ఎఫ్డీలలో పెట్టుబడి పెట్టడం లేదా బుకింగ్ చేసుకోవడం ద్వారా ప్రయోజనాలను పొందవచ్చు. ఈ ఆన్లైన్ ప్రక్రియతో వినియోగదారులు అత్యంత సౌకర్యవంతంగా ఎఫ్డీలను బుక్ చేసుకోవచ్చు.