Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : డెట్రాయిట్ కేంద్రంగా పని చేస్తున్న యుఎస్ టెక్ సంస్థ పై స్క్వేర్ టెక్నాలజీస్ తన గ్లోబ ల్ డెలివరీ సెంటర్ (జిడిసి)ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది. డేటా సైన్స్ అండ్ ఎనలిటిక్స్, ఆర్టిఫిషి యల్ ఇంటెలిజెన్స్, ఐఒటి, సైబర్ సెక్యూరిటీ, యానిమేషన్, విఎఫ్ఎక్స్, సిజిఐ, ఎఆర్, విఆర్ వంటి అభివద్ధి చెందుతున్న రంగాలపై ఈ కేంద్రం దృష్టి సారించనుందని ఆ కంపెనీ తెలిపింది. మదాపూర్‌లోని మైండ్‌స్పేస్ లో ఏర్పాటు చేసిన దీనిని మంగ ళవారం రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ లాంచనంగా ప్రారంభించారు. ఈ కేంద్రంలో తొలుత 300 మంది ఉద్యో గులు పని చేయనున్నారు. రాబో యే రెండేళ్లలో ఈ సంఖ్య 1,000కి పైగా పెరగనుందని ఆ వర్గాలు తెలి పాయి. ''రాష్ట్రంలో యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్ పరిశ్రమను పెంపొం దించడానికి ప్రభుత్వం ఒక విధా నాన్ని తీసుకుంది. హైదరాబాద్‌ను ప్రపంచ యానిమేషన్ రాజధానిగా మార్చేం దుకు అనుకూలంగా ఉండే వాతావరణాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రభు త్వం కట్టుబడి ఉంది'' అని జయేష్ రంజన్ పేర్కొన్నారు. ఈ సెంటర్ తో ప్రపంచ ఖాతాదారులకు భవిష్యత్తు డిజిటల్ అనుభవాన్ని అత్యుత్తమంగా అందించనున్నామని పై స్క్వేర్ గ్రూప్ ప్రెసిడెంట్ శరత్ కొత్తపల్లి అన్నారు.