Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది వ్యాపారుల జీవితాలను డిజిటల్ చెల్లింపులు ఏ విధంగా సరళం చేసాయో సంబరం చేయడానికి అమేజాన్ పే తమ డిజిటల్ కాంపైన్ #AbHarDinHuaAasan రెండవ దశను ఈ రోజు ఆరంభించింది. ఇది ఆరంభమైన నాటి నుండి బిజినెస్ యాప్ కోసం అమేజాన్ పే కోసం 50 లక్షలకు పైగా వ్యాపారులు ఇప్పుడు సైన్ అప్ చేసారు. వ్యాపారాలు అమేజాన్ పే సౌకర్యం అనుభవాల రోజూవారీ ఉదాహరణలను కాంపైన్ ఫిల్మ్ చిత్రీకరించింది మరియు కస్టమర్స్ ఎవరికైనా, ఎక్కడైనా, సులభంగా చెల్లింపులు చేసేలా వీలు కల్పించడానికి చెల్లింపు సాధనాలను ఉపయోగించే సరళతను మరియు తక్షణమే బహుమతులు పొందే సదుపాయాన్ని తెలియచేసింది. కాంపైన్ గురించి మాట్లాడుతూ, వికాస్ బన్సల్, హోల్ టైమ్ డైరక్టర్- అమేజాన్ పే ఇండియా ఇలా అన్నారు, "ప్రతి భారతీయుని యొక్క చెల్లింపులు మరియు ఆర్థిక అవసరాలను పరిష్కరించడం ద్వారా జీవితాలను సరళం చేయడం మరియు అభిలాషలను సాకారం చేయడమే మా లక్ష్యం. మేము డిజిటల్ చెల్లింపులను విశ్వశనీయంగా, సౌకర్యవంతంగా, వేగంగా మరియు ఘర్షణరహితంగా చేసాము మా వ్యాపారులు, కస్టమర్స్ ఇరువురికీ విస్త్రతమైన చెల్లింపుల ఎంపికలు యొక్క ఆప్షన్స్ కు వీలు కల్పించాము. ఎస్ఎంబీలకు మరియు సుక్ష్మ-వ్యాపారులకు చెల్లింపు సాధనాలు మరియు పరిష్కారాలు ద్వారా సాధికారత కల్పించడానికి మేము నిరంతరంగా దృష్టి కేంద్రీకరిస్తాము . ఇవి బహుళ కస్టమర్ టచ్ పాయింట్స్ లో డిజిటల్ చెల్లింపుల అనుభవాన్ని పెంచడంలో సహాయపడతాయి. చైతన్యం పెంచడానికి మరియు డిజిటల్ చెల్లింపులను అనుసరించవలసిన అవసరాన్ని మరింత శక్తివంతం చేయడానికి మరియు ప్రతి వ్యాపారి, కస్టమర్, వయోజనులు లేదా వృద్ధులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు నిరంతరంగా లావాదేవీలు చేసేలా ప్రోత్సహించడానికి చేసే మా ప్రయత్నమే # అబ్ హర్ దిన్ హూవా ఆసాన్." తమ స్టోర్స్ లో ఉన్న హడావిడిలో చెల్లింపుల స్వీకారం సౌలభ్యాన్ని ఏ విధంగా వ్యాపార యజమానులు అనుభవించారో #AbHarDinHuaAasan ఆసాన్ కాంపైన్ ఫిల్మ్ చూపించింది. తమ బడ్జెట్ ను వెంటనే విస్తరించడానికి తమ కస్టమర్స్ కు వీలు కల్పించే అమేజాన్ పే ఐసీఐసీఐ కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ ద్వారా క్రెడిట్ సౌలభ్యాన్ని కూడా ఇది చూపిస్తుంది. ఇంకా, అకౌంట్స్ మధ్య సయోధ్య మరియు ఇంకా ఎన్నో ఫీచర్స్ ద్వారా బిజినెస్ యాప్ కోసం అమేజాన్ పేతో తమ వ్యాపారాలను స్థానిక స్టోర్ యజమానులు ఏ విధంగా పెంచుకుంటున్నారో కూడా ఇది చూపిస్తుంది. మహమ్మారి తరువాత డిజిటల్ చెల్లింపులను ఉపయోగించే సౌలభ్యాన్ని మరియు లక్షలాది వ్యాపారులు మరియు కస్టమర్స్ పై దాని ప్రభావాన్ని 2021లో ఆరంభించబడిన #AbHarDinHuaAasan కాంపైన్ ఫిల్మ్ మొదటి భాగం చూపించింది. ఫిల్మ్ అమేజాన్ పే యొక్క సౌకర్యం, భద్రత మరియు విస్త్రతిని మరియు డిజిటల్ చెల్లింపులను నిరంతరంగా ఆరంభించడానికి సూక్ష్మ వ్యాపార యజమానులకు ఇది ఏ విధంగా ప్రేరేణ కలిగించిందో ఫిల్మ్ చూపించింది . అమేజాన్ పే యుటిలిటి బిల్లులు, రెస్టారెంట్ బిల్లులు, రీఛార్జీలు నుండి ట్రావెల్ టిక్కెట్స్ బుక్ చేయడం వరకు, డిజిటల్ గోల్డ్ మరియు ఆటోమొబైల్ బీమాలో పెట్టుబడి పెట్టడం, డబ్బు బదిలీ చేయడం మరియు ఇంకా ఎన్నో వాడకపు అంశాలను అమేజాన్ పే అందిస్తుంది. అమేజాన్ పే లేటర్, అమేజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, అమేజాన్ పే బ్యాలెన్స్, అమేజాన్ పే యూపీఐ షాపింగ్ చేయడానికి మరియు నిరంతరంగా చెల్లించడానికి ఇంటి వద్ద క్యాష్ లోడ్ ఫీచర్ వంటి వివిధ చెల్లింపు విధానాలను కస్టమర్స్ అమేజాన్ పే పై ఉపయోగించవచ్చు.