Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : చిన్న సెలూన్ల నైపుణ్యాలను పెంచడానికి మరియు హెయిర్ డ్రెస్సింగ్ పరిశ్రమను ఆధునీకరించడానికి అంకితమైన అగ్రగామి వృత్తినైపుణ్యత గల కేశసంరక్షణ మరియు కలర్ బ్రాండ్ అయిన మ్యాట్రిక్స్ ఇండియా, ముంబైలో ఒక 2-రోజుల మెగా ఈవెంటు, హెయిర్ కలర్ మరియు కళారూపము పోటీ అయిన ఉ మ్యాట్రిక్స్ హెయిర్ ట్రాన్స్ఫార్మర్స్ వేడుకకు ఆతిథ్యమిచ్చింది, ఇందులో దేశవ్యాప్తంగా ఇప్పుడిప్పుడే ఉద్భవిస్తున్న హెయిర్డ్రెస్సర్లు ఒక కొత్త టెక్నిక్ అయినఉనికలర్ మెల్టింగ్ుతో తమ విశేష ప్రతిభాపాటవాలను ప్రదర్శించి చూపుతూ ఈ పోటీలో పాల్గొన్నారు. ఈ పోటీ మే నెల 15 వ తేదీన ప్రారంభమయింది మరియు 400 నగరాల నుండి అద్భుతంగా హెయిర్డ్రెస్సర్ల నుండి 62,000 ఎంట్రీలను అందుకొన్నది. తారిక్ జెసారెవిచ్ ఉ ఆస్ట్రేలియన్ మ్యాట్రిక్స్ కళాకారుడు మరియు ు సెలూన్ యొక్క యజమాని, బినైఫర్ పార్డివాల్లా ఉ ప్రొఫెషనల్ ప్రోడక్టుల విభాగం కొరకు సప్మేనా విద్యా డైరెక్టర్, మరియు మెల్రాయ్ డిక్సన్ ఉ మ్యాట్రిక్స్ ఇండియా జాతీయ విద్యా అధిపతి వంటి ప్రఖ్యాతి చెందిన న్యాయనిర్ణేతల ప్యానల్, సంవత్సరం యొక్క అత్యుత్తమ హెయిర్ ఆర్టిస్టులను ఎంపిక చేయడానికి గాను, పోటీలో పాల్గొన్న వారిని వివిధ పారామితులపై పరీక్షించి న్యాయనిర్ణయం చేశారు. మ్యాట్రిక్స్ హెయిర్ ట్రాన్స్ఫార్మర్స్ 2022 ద్వారా, మ్యాట్రిక్స్ ఇండియా ప్రతిభను సంబరంగా జరుపుకోవడానికి ఒక వేదికను ఏర్పాటు చేయడం మాత్రమే కాకుండా, ఆశావహులైన హెయిర్డ్రెస్సర్లు తమ కళాత్మక నైపుణ్యాలను పెంచుకోవడానికి, ఉన్నతీకరించుకోవడానికి మరియు ప్రదర్శించి చూపడానికి, వారిని భవిష్యత్తు- కొరకు సిద్ధపరచడానికి డిజిటల్ గా కూడా నైపుణ్య పెంపుదలకు ఒక వేదికను ఇచ్చింది. టెక్నిక్, స్టైలింగ్ మరియు ప్రెజెంటేషన్ ప్రాతిపదికన ఎంట్రీలు మదింపు చేయబడ్డాయి, ఆ తదనంతరం అన్ని ప్రాంతాల వ్యాప్తంగా 160 మంది సెమీ- ఫైనలిస్టులను సంక్షిప్త జాబితా చేయడం జరిగింది. ఆ తర్వాత, 1 వ రోజున సాంకేతిక రౌండులో పాల్గొనడానికి సెమీ-ఫైనలిస్టులను ముంబైకి ఆహ్వానించడం జరిగింది, అక్కడ వారిని న్యాయనిర్ణేతలు కలరేషన్ నైపుణ్యాల పైన పరీక్షించి న్యాయనిర్ణయం చేశారు. దేశ వ్యాప్తంగా ప్రాంతాల నుండి వచ్చిన సెమీ-ఫైనలిస్టులు అత్యుత్తమ మ్యాట్రిక్స్ కలర్ మెల్ట్ లుక్స్ సృష్టించడానికి పోటీపడ్డారు, దానికి నైపుణ్యమైన ఫోటోషూట్ ద్వారా జీవం కల్పించబడింది. దీని తర్వాత న్యాయనిర్ణేతల మదింపు జరిగింది, మరియు అంతిమంగా 20 మంది విజేతలను ప్రకటించడంతో ఆ రోజు రాత్రి ఒక గొప్ప వేడుక సంరంభముతో ముగిసింది.
2 వ రోజున, 20 మంది ట్రాన్స్ఫార్మర్లను (పరివర్తనకారులు), ప్రముఖ మ్యాట్రిక్స్ హెయిర్ ఆర్టిస్టు తారిక్ జెసారెవిచ్ గారితో ఒక సంభాషణాత్మక ముఖా-ముఖీ సెషన్ కు ఆహ్వానించడం జరిగింది, దాని తదనంతరం అతను, బినైఫర్ పార్డివాల్లా మరియు మెల్రాయ్ డిక్సన్ గారలచే ఒక సమాచారాత్మక హెయిర్-స్టైలింగ్ కార్యశాల నిర్వహించబడింది. ఈ కార్యక్రమం తర్వాత ఒక ప్రత్యక్ష వర్కింగ్ సెషన్ జరిగింది, ఇందులో సెలెబ్రిటీ ప్రభావకారులపై స్టైలింగ్ లుక్స్ సమన్వయం చేసుకొని మరియు సహ-సృష్టి చేసుకోవడానికి ట్రాన్స్ఫార్మర్లకు వీలు కల్పించబడింది. పరిశ్రమలోని హెయిర్ ఆర్టిస్టు మరియు నిపుణులతో ఒక కంటెంట్ రూపకల్పన కార్యక్రమంతో ఈ ఈవెంటు ముగిసింది. ఈ వేడుకకు పరిశ్రమ ప్రముఖులైన క్రీమ్ డీ లా క్రీమ్ బృందం వారు హాజరయ్యారు, ఇందులో ఇతరులతో పాటు చేతనా పాండే, సందీపా ధర్, డైజీ బాత్రా, సాక్షి సిధ్వానీ వంటి ప్రముఖులతో పాటుగా అనేకమంది సుప్రసిద్ధ ప్రభావకారులు ఉన్నారు.
మ్యాట్రిక్స్ హెయిర్ ట్రాన్స్ఫార్మర్స్ యొక్క 20 మంది అంతిమ విజేతలలో విశాఖపట్టణం నుండి సత్యం పరిహార్ ఒకరుగా ఉన్నారు, అతను ఎ.ఆర్. హెయిర్ స్టూడియోలో పనిచేస్తూ ఉన్నారు. హెయిర్డ్రెస్సింగ్ రంగములో అతనికి 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.
మ్యాట్రిక్స్ హెయిర్ ట్రాన్స్ఫార్మర్స్ ట్రోఫీ గెలుచుకున్న మీదట, సత్యం పరిహార్ ఇలా అన్నారు, నిఈ క్షణంలో నాకు ఎంత సంతోషంగా ఉందో నేను మాటల్లో వర్ణించి చెప్పలేను. ఎనిమిది సంవత్సరాల క్రితం, ఒక చిన్న సెలూన్ నుండి నేను ఈ ప్రయాణాన్ని ప్రారంభించాను, మరి ఈ రోజు మ్యాట్రిక్స్ హెయిర్ ట్రాన్స్ఫార్మర్ గా ఇక్కడ ఉన్నాను. నేను మా హితబోధకులందరికీ నిజంగా ఎంతో కృతజ్ఞుడనై ఉన్నాను, వారు లేకుంటే ఇది ఎప్పటికీ సాధ్యమయ్యేదే కాదు. ఒక హెయిర్డ్రెస్సర్ గా నా సామర్థ్యాలను ప్రదర్శించి చూపించే ఈ అవకాశం ఇచ్చినందుకు టీమ్ మ్యాట్రిక్స్ వారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానుు అన్నారు.
ఈ ఈవెంట్ పై వ్యాక్యానిస్తూ, L'Oréal ఇండియా జనరల్ మేనేజర్, శ్రీ సుహాస్ లఖ్మడే గారు ఇలా అన్నారు, నిమ్యాట్రిక్స్ ఇండియా వద్ద మేము, ఉద్భవిస్తున్న హెయిర్ డ్రెస్సర్ల ప్రతిభను పెంచడం మరియు పోషించడాన్ని నిరంతరమూ నడిచే ఒక మహత్కార్యంగా విశ్వసిస్తాము మరియు వారి నైపుణ్యాలను ప్రదర్శించి చూపడానికి గాను వారికి ఒక ఏకీకృత వేదికను అందించడానికి కృషి చేస్తాము. మేము దీనిని అట్టడుగు స్థాయిలో చేస్తాము మరియు హెయిర్ ఆర్టిస్టులుగా వారి అత్యున్నత సంభావ్యతను చేరుకోవాలనే వారి ఆకాంక్షలకు తోడ్పాటును అందిస్తాము. దేశవ్యాప్తంగా భారీ విజయముతో ఈ ఈవెంటుకు జీవం తీసుకురావడానికి గాను హెయిర్డ్రెస్సర్ల నుండి అత్యద్భుతమైన స్పందనను అందుకోవడం పట్ల మేము ఎంతగానో పరవశించిపోతున్నాము. దేశవ్యాప్తంగా హెయిర్డ్రెస్సర్లు మ్యాట్రిక్స్ కలర్ మెల్ట్ తో సృష్టించిన అత్యద్భుతమైన కలర్ లుక్స్ చూస్తే నిజంగా అది ఎంతో అద్భుతం అనిపించింది. మ్యాట్రిక్స్ హెయిర్ ట్రాన్స్ఫార్మర్స్ అనేది కేవలం ఒక పోటీ మాత్రమే కాదు, అది హెయిర్ డ్రెస్సింగ్ రంగములో ప్రతిభకు మరియు కళాత్మకతకు ఒక చుక్కాని. అటువంటి మరిన్ని వేదికలతో హెయిర్డ్రెస్సర్ల కొరకు ఎల్లలు చెరిపివేయాలని మరియు అవి వారికి సుసంపన్నమైన అనుభవం కలుగజేస్తూ ఉండాలనీ మేము ఆశిస్తున్నాము.