Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రస్తుత ఏడాది సెప్టెంబర్లో జీవితేతర బీమా ప్రియం వసూళ్లలో 15.51 శాతం పెరుగుదల చోటు చేసుకుందని జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ (జిఐసి) తెలిపింది. గడిచిన మాసంలో ఇది రూ.20,423.38 కోట్ల ప్రీమియం వసూళ్లయ్యిందని వెల్లడించింది. నాలుగు ప్రభుత్వ రంగ బీమా సంస్థల ప్రీమియంలో ఏకంగా 22.46 శాతం వృద్థి చోటు చేసుకుందని వెల్లడించింది. ప్రయివేటు రంగ సంస్థల ప్రీమియంలో 14.5 శాతం పెరుగుదల నమోదయ్యింది.