Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : డిజిటల్ చెల్లింపుల వేదిక పేటియం మాతృసంస్థ అయి నా వన్ 97 కమ్యూనికేషన్స్ మరో సారి భారీ నష్టాలను మూటగట్టు కుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికం (క్యూ2)లో రూ.571 కోట్ల నష్టాలు చవి చూసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.473 కోట్ల నష్టాలు నమోదు చేసింది. గడిచిన క్యూ2లో కంపెనీ రెవెన్యూ 76 శాతం పెరిగి రూ.1,914 కోట్లకు చేరింది. గతేడాది ఇదే క్యూ1లో రూ.1,086 కోట్ల రెవెన్యూ ఆర్జించింది. గడిచిన త్రైమాసికంలో రూ.7,313 కోట్ల రుణాలు జారీ చేసినట్లు ఆ సంస్థ గత నెలలో తెలిపింది.