Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒత్తిడిలో పలు రంగాలు
- ఎంఇఐ అధ్యయనంలో వెల్లడి
నవతెలంగాణ- బిజినెస్ డెస్క్
దేశ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న భయాలు ఉద్యోగ నియామకాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. మాంద్యం ముంచుకొస్తోందనే ఆందోళనలకు తోడు స్టార్టప్ రంగం ఎదుర్కొంటున్న ఫండింగ్ సమస్య లు కొత్త ఉద్యోగాల సృష్టికి ప్రధాన అడ్డంకింగా నిలుస్తున్నా యి. గతేడాది అక్టోబర్లోని నియామకా లతో పోల్చితే ప్రస్తుత ఏడాది క్రితం నెల నియామకాల్లో 6 శాతం తగ్గుదల చోటు చేసుకుందని మోన్స్టార్ ఎంప్లాయిమెంట్ ఇండెక్స్ (ఎంఇఐ) ఓ రిపోర్టులో తెలిపింది. ప్రతీనెల, నెలకు నియామకాలు పడిపోతున్నాయని విశ్లేషించింది.
గడిచిన అక్టోబర్ నెలలో ఆటోమేషన్, బ్యాంకింగ్, ఫైనాన్స్, 5జి రంగాల్లో మినహా మిగితా రంగాలన్నీ ఒత్తిడిలోనే ఉన్నాయని తెలిపింది. దేశంలో నియో బ్యాంకింగ్ పద్దతులు పెరుగుతున్న నేపథ్యంలో ఫిన్టెక్ రంగంలో ఉద్యోగ కల్పన పెరిగిందని తెలిపింది. పండగ సీజన్ నేపథ్యంలో రిటైల్, అభరణాలు, వస్త్రాల రంగంలో నియామకాలకు డిమాండ్ నెలకొందని పేర్కొంది. మరోవైపు బిపిఒ, టెక్నలాజీ ఆధారిత సంస్థలు, మీడియా, ఎంటర్టైన్మెంట్, ఐటి, విద్యా, వైద్య, ఇంజనీరింగ్ తదితర రంగాల్లో ఉద్యోగ కల్పన భారీగా తగ్గిపోయింది.
హైదరాబాద్లో 5 శాతం క్షీణత
ద్వితీయ శ్రేణీ నగరాల్లో ఉద్యోగ నియామకాల్లో ఏడాదికేడాదితో పోల్చితే కొంత సానుకూలత చోటు చేసుకుంది. కోయంబత్తూరు, అహ్మాదాబాద్ నగరాలు స్థిర వృద్థిని నమోదు చేశాయి. మెట్రో నగరాల్లో ముంబయి కూడా స్థిర ఉద్యోగ కల్పనలు చోటు చేసుకున్నాయి. హైదరా బాద్లో 5 శాతం, బెంగళూరులో 11 శాతం, కోల్కత్తాలో 14 శాతం, ఢిల్లీ-ఎన్సిఆర్ 2 శాతం చొప్పున తగ్గుదల నమోదయ్యింది. గుజరాత్ లోని బరోడాలో ఉద్యోగ కల్పన ఏకంగా 22 శాతం, చంఢఘీడ్లో 16 శాతం చొప్పున పతనం చోటు చేసుకోవడం ఆందోళనకరం. ప్రతీ నెల ఆన్లైన్ ఉద్యోగ ప్రకటనలను విశ్లేషించి ఈ రిపోర్టును రూపొందిం చింది. 2022 అక్టోబర్ 1 నుంచి 31వ తేదిల్లో వచ్చిన మోన్స్టార్ ఎంప్లాయిమెంట్ ఇండెక్స్ (ఎంఇఐ) డేటా ఆధారంగా విశ్లేషణ చేసింది.