Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : రెండు సంవత్సరాల ఎదురుచూపుల తరువాత 14వ ఎడిషన్ ఐజీడీసీ – ద ఇండియా గేమ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 4000కు పైగా అతిథులను చూసింది. వీరిలో గేమ్ డెవలపర్లు, పబ్లిషర్లు, ఇన్వెస్టర్లు, గేమింగ్ ప్రియులు ఉన్నారు. ఈ సదస్సు 03 నవంబర్ నుంచి 05 నవంబర్ 2022 వరకూ హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో జరిగింది.
ఇండియా గేమ్ డెవలపర్ కాన్ఫరెన్స్ వినూత్నమైనది. పరిశ్రమ కోసం పరిశ్రమ చేపట్టిన కార్యక్రమమిది. మదుపరులు, గేమ్ పబ్లిషర్స్‌తో నెట్వర్కింగ్ అవకాశాలు కల్పించడంతో పాటుగా అదనపు నైపుణ్యాలను సంతరించుకునే అవకాశం కల్పించడం, గేమ్ డెవలపర్ల కు అవసరమైన పరిజ్ఞానం అందించడం మరియు మద్దతు అందించడం లక్ష్యంగా చేసుకుంది. దాదాపు 40 మంది అంతర్జాతీయ స్పీకర్లతో పాటుగా 150 మంది స్పీకర్లు హాజరైన ఈ మూడు రోజుల సదస్సులో 80కు పైగా సెషన్లు జరిగాయి. వీటిలో వర్క్‌షాప్‌లు, చర్చలు మరియు గేమ్స్ సాంకేతికతల చుట్టూ ప్యానెల్ చర్చా వేదికలు, ఆర్ట్,డిజైన్ మరియు ప్రొడక్షన్ సంబంధించిన చర్చలు జరిగాయి. ఈ కాన్ఫరెన్స్‌లో సీఎక్స్ఓ చర్చా వేదికలు కూడా ఉన్నాయి. ఇక్కడ అత్యాధునిక భారతీయ గేమ్స్ పరిశ్రమ, పెట్టుబడుల ధోరణులు, భవిష్యత్ అంచనాల గురించి కూడా ఇక్కడ చర్చ జరిగింది. ఐజీడీసీ యొక్క ప్రతిష్టాత్మక నెట్వర్క్ కార్యక్రమం, ఇన్వెస్టర్ –పబ్లిషర్ కనెక్ట్‌లో అత్యధికంగా 75 స్టార్టప్స్, 28 మంది ఇన్వెస్టర్లు మరియు పబ్లిషర్లు పాల్గొన్నారు. వీరు రెండు రోజులలో 600కు పైగా సమావేశాలను నిర్వహించారు. ఐజీడీసీ అవార్డులలో సైతం రికార్డు సంఖ్యలో 150 మందికి పైగా గేమ్ ఎంట్రీలు వచ్చాయి. ఈ అవార్డులలో పాపులర్ ఛాయిస్ అంటూ నూతన విభాగం సృష్టించబడింది. వీక్షకుల ఆసక్తిని పొందిన సంస్థలను ఈ విభాగంలో సత్కరించడం వల్ల ఈ అవార్డుల వేడుక పూర్తి అనుసంధానితంగా మారింది. బీవైఓజీ (బిల్డ్ యువర్ ఓన్గేమ్) కార్యక్రమానికి సైతం రికార్డు సంఖ్యలో 700కు పైగా అభ్యర్థులు పాల్గొన్నారు. వీరు 170కు పైగా గేమ్స్‌ను న్యాయనిపుణుల సమీక్ష కోసం పంపించారు. ఈ సదస్సు మూడవ రోజు ఓ నూతన కార్యక్రమాన్ని ఐజీడీసీ ఫ్యూచర్స్ శీర్షికన ప్రారంభించారు. గేమింగ్ పరిశ్రమలో అవకాశాలపై దృష్టి సారించి దీనిని ప్రారంభించారు. దీనిద్వారా గేమింగ్ పరిశ్రమలో భావి తరపు ప్రతిభావంతులను ప్రోత్సహించడం లక్ష్యంగా చేసుకున్నారు. ఈ సదస్సు గురించి ఐజీడీసీ కన్వీనర్ మరియు ఛైర్పర్సన్ రాజేష్రావు మాట్లాడుతూ ‘‘ ఐజీడీసీ 2022 అన్ని అంచనాలనూ అధిగమించింది. కొవిడ్ మహమ్మారి అనంతర కాలంలో మొట్టమొదటిసారిగా ఈ సదస్సు నిర్వహించాము. గేమింగ్ రంగం నుంచి అన్ని వర్గాలూ ఈ సదస్సులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. వ్యక్తిగతంగా కలవడంతో పాటుగా నెట్వర్కింగ్ అవకాశాలను పెంచుకోవడానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఈ సంవత్సరం మదుపరులు, ప్రచురణ కర్తలు, స్టార్టప్స్ మధ్య రికార్డు స్ధాయిలో సమావేశాలు జరిగాయి. కీలకమైన ధోరణుల పరంగా చూస్తే భారతీయ నేపథ్యాలతో పలు గేమ్స్ రాబోతున్నాయి. దానితో పాటుగా స్థానిక సంస్కృతులు, సామాజిక ఫ్లేవర్ వీటిలో కనబడబోతున్నాయి. ఐజీడీసీ అవార్డులల మొత్తంమ్మీద నాణ్యమైన ఎంట్రీల సబ్మిషన్స్ కూడా గణనీయంగా పెరిగాయి. మరో ఉత్సాహపూరితమైన సంవత్సరం ముగియడంతో , ఈ ఎడిషన్ విజయం, గేమింగ్ పరిశ్రమ అభివృద్ధికి తోడ్పడటంతో పాటుగా మరిన్ని మైలురాళ్లు చేరుకోవడానికి తోడ్పడుతుందని విశ్వసిస్తున్నాము’’ అని అన్నారు. పరిశ్రమ నుంచి ఐజీడీసీకి బలీయమైన మద్దతు లభించింది. ఈ సంవత్సరం సదస్సుకు ప్రెజెంటింగ్ స్పాన్సర్‌గా ఎపిక్ గేమ్స్ యొక్క అన్రియల్ ఇంజిన్ వ్యవహరించగా , ప్లాటినమ్ స్పాన్సర్‌గా క్రాఫ్టాన్ ; గోల్డ్ స్పాన్సర్ ఏడబ్ల్యుఎస్ ; సిల్వర్ స్పాన్సర్స్ రాక్‌స్టార్ గేమ్స్ , క్వాలీ ; ఎక్స్పీరియన్స్ భాగస్వామిగా గేమ్స్ 24గీ7 ; బ్రాంజ్ స్పాన్సర్స్‌గా మైక్రోసాఫ్ట్, ఎక్స్‌బాక్స్, వెంతన వెంచర్స్. అర్షత్ రాక్, వింజో, హైపర్ హిప్పో, హీరో వైర్డ్, టెజోస్ ; అవార్డు స్పాన్సర్‌గా నజారా టెక్నాలజీస్ ; అసోసియేట్ స్పాన్సర్‌గా లండన్ స్టాక్ ఎక్సేంజ్ గ్రూప్, పేయనీర్లోకో మరియు హంగామా వ్యవహరించాయి. ఐజీడీసీ ఫ్యూచర్స్ కు క్రేజీ ల్యాబ్స్ మద్దతు అందించగా, కంట్రీ పార్టనర్‌గా గ్లోబల్ విక్టోరియా వ్యవహరించింది. ఎకో సిస్టమ్ భాగస్వాములుగా లక్ష్య డిజిటల్ మరియు ఎస్గోనిమ్ వ్యవహరించాయి.